కేసీఆర్‌.. నిరంకుశ విధానానికి పరాకాష్ట: ఈటల

విధాత: ఈ ఏడాది కూడా గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించటం సీఎం కేసీఆర్‌ నిరంకుశ విధానానికి పరాకాష్ట అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభం కావడం ఆనవాయితీ, కానీ గత ఏడాది గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించారనీ, ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తామంటున్నారు.. ఇంతకన్నా నియంతృత్వం ఇంకొకటి ఉంటుందా.. అని నిలదీశారు. గతంలో ఒక్క సభ్యుడు ఉన్నా ఆ పార్టీ ఎమ్మెల్యేను […]

  • By: krs    latest    Jan 25, 2023 7:46 AM IST
కేసీఆర్‌.. నిరంకుశ విధానానికి పరాకాష్ట: ఈటల

విధాత: ఈ ఏడాది కూడా గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించటం సీఎం కేసీఆర్‌ నిరంకుశ విధానానికి పరాకాష్ట అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభం కావడం ఆనవాయితీ, కానీ గత ఏడాది గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించారనీ, ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తామంటున్నారు.. ఇంతకన్నా నియంతృత్వం ఇంకొకటి ఉంటుందా.. అని నిలదీశారు. గతంలో ఒక్క సభ్యుడు ఉన్నా ఆ పార్టీ ఎమ్మెల్యేను బీఏసీకి పిలిచేవారు.. ఇప్పుడు ఎంత మంది ఉన్నా పట్టించుకునే స్థితి లేదని ఈటల మండిపడ్డారు.

కరోనా కారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించలేకపోతున్నాం.., రాజ్‌ భవన్‌లోనే నిర్వహించుకోండని రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాయటం రాజ్యాంగాన్ని అవమానించటమేనని ఆయన అన్నారు. ఇప్పుడు కరోనా ఏ స్థితిలో ఉన్నదో అందరికీ ఎరుకే… అలాంటిది, గవర్నర్‌పై అయిష్టత, వ్యతిరేకతతో రిపబ్లిక్‌ దినోత్సవాన్ని నిర్వహించకుండా ఉండటం విషాదం అని ఈటల విమర్శించారు.

ఇదిలా ఉంటే… రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. గణతంత్ర వేడుకలకు కరోనా సాకుగా చూపటం సరియైంది కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే పరేడ్‌తో కూడిన గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపాలని సూచించంటం గమనార్హం.

సీఎం కేసీఆర్ రాచరిక పోకడ పోతున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీల మధ్య గోడలు కట్టి ఎన్నికల ప్రక్రియను డబ్బు మయం చేసిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేస్తూ దాన్నే గెలుపుగా చాటుకొంటున్నాడని విమర్శించారు. హుజూరాబాద్‌లో రూ. 600 కోట్లు, మునుగోడులో 100 కోట్లు ఖర్చుచేశారన్నారు. అన్ని పార్టీల్లో కేసీఆర్‌ తన కోవర్టులను పెట్టుకొని మకిలీ రాజకీయం చేస్తున్నాడని ఈటల విమర్శించారు.

పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందనీ, పోలీసులు కేసీఆర్‌ కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పోలీసుల కనుసన్నల్లో డబ్బుల పంపిణీ జరుగుతున్నదని విమర్శించారు. నా 20ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు. తెలంగాణ దుర్నీతి, డబ్బు రాజకీయాన్ని దేశంపై రుద్దటం కోసమే బీఆర్‌ఎస్‌ పార్టీ అని ఈటల అన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని ధనయజ్ఞమని విమర్శించిన కేసీఆర్‌ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని పంపులు మునిగాయో, ఎంత నష్టం వచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏసీడీ పేరుతో విద్యుత్ అదనపు బిల్లులు వసూలు చేస్తున్న కేసీఆర్‌కు బషీర్ బాగ్‌ కాల్పులతో చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని హెచ్చరించారు.