రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధం.. ఒకరి మృతి

విధాత: సూర్యాపేట జిల్లా పరిధిలో మునగాల మండలం మద్దెల చెరువు సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంటనే బస్సు దిగడంతో వారంతా సురక్షితంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. స్కూటీ పై ప్రయాణిస్తున్న మురుగేష్ రాజు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. పోలీసులు కేసు […]

  • By: krs    latest    Mar 30, 2023 4:44 AM IST
రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధం.. ఒకరి మృతి

విధాత: సూర్యాపేట జిల్లా పరిధిలో మునగాల మండలం మద్దెల చెరువు సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమైంది.

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంటనే బస్సు దిగడంతో వారంతా సురక్షితంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. స్కూటీ పై ప్రయాణిస్తున్న మురుగేష్ రాజు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.