బుర్ఖాలో థియేటర్‌కి వెళ్లిన స్టార్ హీరో.. ఇతనిని కనిపెట్టారా..!

ఇప్పుడంటే ఓటీటీలు వచ్చాయి కాబట్టి చాలా మంది థియేటర్స్ వెళ్లడం తగ్గించారు కాని, ఒకప్పుడు అయితే ఎవరికైన మంచి మజా దొరకాలి అంటే మాత్రం థియేటర్స్‌కి వెళ్లేవారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు సైతం థియేటర్‌లో సినిమాలు చూసేందుకు ఇష్టపడేవారు. ప్రతి శుక్రవారం కూడా థియేటర్ దగ్గర అభిమానుల కోలాహాలం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆ సందడిని చూసేందుకు సెలబ్రిటీలు ఏదో రకంగా థియేటర్స్‌కి వస్తుంటారు. ఆ మధ్య కొందరు హీరోయిన్స్ బుర్ఖా వేసుకొని థియేటర్‌కి వచ్చి సినిమాలు చూసి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒక టాలీవుడ్ హీరో ఎవరూ తనను గుర్తుపట్టకుండా బుర్ఖాలో వెళ్లాడు.
ప్రేక్షకులతో కలిసి తను నటించిన సినిమాని చూడాలని భావించిన హీరో ఏకంగా బుర్ఖా వేసుకొని వెళ్లాడు. మరి ఇంతకు ఆ హీరో ఎవరు అనే కదా మీ డౌట్..మహేష్ బావ, ప్రముఖ హీరో సుధీర్ బాబు.ఆయన నటించిన తాజా చిత్రం మామా మశ్చీంద్ర. ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రేక్షకుల స్పందన ఏంటి అని తెలుసుకునేందుకు ఏకంగా బుర్ఖాలో వెళ్లాడు ఈ యువ హీరో. ప్రస్తుతం సుధీర్ బాబుకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అయితే బుర్ఖాలో సుదీర్ బాబుని కనిపెట్టం కష్టంగా ఉన్నప్పటికీ తర్వాత ఆయనే అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.
ఇక సుధీర్ బాబు నటించిన మామా మశ్చీంద్ర సినిమా విషయానికొస్తే.. ఇందులో ట్రిపుల్ రోల్‌లో కనిపించి మెప్పించారు సుధీర్ బాబు. ఇప్పటివరకు కమెడియన్‌గానే మనకు తెలిసిన హర్షవర్ధన్ ఈ సినిమాకి డైరెక్టర్‌గా పని చేశాడు. ఈషా రెబ్బా, మృణాళిని రవి..సుధీర్ బాబు సరసన హీరోయిన్లుగా నటించారు. రాజీవ్ కనకాల, అభినయ, అజయ్ కీలకపాత్రలు పోషించగా, చిత్రానికి చేతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్‌రావు మామా మశ్చీంద్ర సినిమాను నిర్మించగా, శుక్రవారం (అక్టోబర్ 6)న చిత్రాన్ని విడుదల చేశారు. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. సుధీర్ బాబు నటన బాగుందంటూ విమర్శకుల ప్రశంసలు లభించాయి.