కెన‌డా విద్యార్థి వీసాల్లో కోత‌

కెన‌డా ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ‌ విద్యార్థుల ప్ర‌వేశాల‌పై కోత విధించింది. ప్ర‌స్తుతం తీసుకుంటున్న కోటాలో సుమారు 35 శాతం కోత విధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది

  • Publish Date - January 23, 2024 / 12:00 PM IST

విధాత‌: కెన‌డా ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ‌ విద్యార్థుల ప్ర‌వేశాల‌పై కోత విధించింది. ప్ర‌స్తుతం తీసుకుంటున్న కోటాలో సుమారు 35 శాతం కోత విధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ కోటా త‌గ్గింపు రెండేళ్ల‌పాటు అమ‌లులో ఉంటుంది. గృహ‌వ‌స‌తి సంక్షోభంతోపాటు విదేశీ విద్యార్థుల ప్ర‌వేశాల‌కు సంబంధించి త‌ప్పుడు ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంభిస్తున్న సంస్థ‌ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు తెలుస్తున్న‌ది.


కోటా త‌గ్గింపు భార‌తీయ విద్యార్థుల‌పై బాగా ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. ఈ నిర్ణ‌యం ప్ర‌కారం 2024లో అంత‌ర్జాతీయ విద్యార్థుల ప్ర‌వేశాల‌లో 35 శాతం కోత‌ప‌డ‌నున్న‌ట్టు ఇమ్మిగ్రేష‌న్ మంత్రి మార్క్ మిల్ల‌ర్ తెలిపారు. కొత్త విధానం ప్ర‌కారం 2024లో 3,64,000 మంది విద్యార్థుల‌ను అనుమ‌తించే అవ‌కాశం ఉంది.