సుమన్‌పై కేసు.. ఓ పోరంబోకు వల్లే: చిరంజీవి

సుమన్ బ్లూ ఫిలిం కేసు విషయంలో మండిప‌డిన చిరు విధాత: ఒకప్పుడు చిరంజీవి- బాలకృష్ణ- సుమన్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు నడిచేది. సుమన్ కూడా స్టార్ రేసులో దూసుకుపోయేవాడు. కానీ ఆయనపై బ్లూ ఫిలిం కేసులు వచ్చి జైలు పాలయ్యాడు. దానికి కారణం చిరంజీవి అంటూ పుకార్లు వచ్చాయి. దీన్ని స్వయంగా సుమన్ ఎన్నోసార్లు ఖండించాడు. తాజాగా యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు ఈ విష‌యంపై కొన్ని సంచలన విషయాలను చెప్పుకొచ్చారు. అంతా […]

  • Publish Date - January 13, 2023 / 10:30 AM IST

సుమన్ బ్లూ ఫిలిం కేసు విషయంలో మండిప‌డిన చిరు

విధాత: ఒకప్పుడు చిరంజీవి- బాలకృష్ణ- సుమన్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు నడిచేది. సుమన్ కూడా స్టార్ రేసులో దూసుకుపోయేవాడు. కానీ ఆయనపై బ్లూ ఫిలిం కేసులు వచ్చి జైలు పాలయ్యాడు. దానికి కారణం చిరంజీవి అంటూ పుకార్లు వచ్చాయి. దీన్ని స్వయంగా సుమన్ ఎన్నోసార్లు ఖండించాడు. తాజాగా యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు ఈ విష‌యంపై కొన్ని సంచలన విషయాలను చెప్పుకొచ్చారు.

అంతా నా కర్మ.. ఇలాంటి వాటికి కూడా జవాబు ఇవ్వాల్సి వస్తోంది. ఈ విషయంలో ఒక పోరంబోకు జర్నలిస్టు వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది. సుమన్ జైలు పాలైనప్పుడు నాపై బురద చల్లారు.. ఆరోపణలు చేశారు. నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నేను, సుమన్ చాలా మంచి స్నేహితులం.

ఎవడో పోరంబోకు జర్నలిస్ట్ ఏదో రాశాడు. పోరంబోకు అనే మాట కాస్త ఘాటు‌గా ఉండవచ్చు. కానీ వాడు ఏదో రాశాడు.. దానిని అంద‌రు వక్రీకరించారు. ఇది బాగా ప్రచారం అయింది. కొన్ని వందల సార్లు సుమన్ ఏం లేదు అని చెప్పాడు.

ఆయనకి నాకు ఎలాంటి విరోధం లేదు. ఇప్పటికీ మేము కలిసి మాట్లాడుకుంటాం. కానీ కొందరు మాత్రం శాడిస్టుల్లా మాట్లాడుతుంటారు. ఇలాంటి వాటిపై మాట్లాడుకోవడం సిగ్గుచేటు. ఏ తప్పు చేయని వాడిపై ఆరోపణలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నా నుంచి ఎవరూ ఏ తప్పు పట్టలేరు అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు చిరు.