విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీఆర్ఎస్ కు చెందిన జయశంకర్ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టారని భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, కుమారుడు గౌతమ్‌తో సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
నాగవెల్లి రాజలింగమూర్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన నాయకులు, మాజీ ఎమ్మెల్యేలపై భూ ఆక్రమించిన కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని అంటున్నారు