CBI | వివేకా హత్య కేసులో.. సీబీఐ తొలి చార్జీషీట్ దాఖలు
CBI విచారణ ఈనెల 14కు వాయిదా వేసిన ధర్మాసనం హైదరాబాద్, విధాత: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సప్లిమెంటరీ చార్జీషీట్ దాఖలు చేసింది. 2019, మార్చి 15న హత్యకు గురైన వివేకా హత్య కేసు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయిన తర్వాత […]

CBI
- విచారణ ఈనెల 14కు వాయిదా వేసిన ధర్మాసనం
హైదరాబాద్, విధాత: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సప్లిమెంటరీ చార్జీషీట్ దాఖలు చేసింది. 2019, మార్చి 15న హత్యకు గురైన వివేకా హత్య కేసు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ అయిన విషయం తెలిసిందే.
తెలంగాణ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయిన తర్వాత సీబీఐ తొలిసారి చార్జీషీట్ దాఖలు చేసింది. ఇందులో ఉదయ్‌కుమార్‌రెడ్డి(ఏ-6), వైఎస్ భాస్కర్‌రెడ్డి(ఏ-7), వైఎస్ అవినాశ్‌రెడ్డి(ఏ-8)లతో పాటు అనుమానిత నిందితుల కింద వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డిని ఏ-9గా, ఏదుల ప్రకాశ్‌ను ఏ-10గా పేర్కొంది. విచారణ సందర్భంగా గంగిరెడ్డి(ఏ-1), సునీల్ యాదవ్(ఏ-2), ఉమాశంకర్‌రెడ్డి(ఏ-3), శివశంకర్‌రెడ్డి(ఏ-5), ఉదయ్‌కుమార్‌రెడ్డి(ఏ-6), వైఎస్ భాస్కర్‌రెడ్డి(ఏ-7) హాజరయ్యారు. చంచల్‌గూడ జైలులో ఉన్న వీరిని పోలీసులు కోర్టుకు తరలించారు. కాగా, దస్తగిరి(ఏ-4) మాత్రం విచారణకు హాజరుకాలేదు.
చార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత విచారణను న్యాయమూర్తి ఈ నెల 14వ తేదీకి వాయిదా వేశారు. ఏపీలో విచారణలో ఉండగా రెండుసార్లు చార్జీషీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.