CBI
విధాత: వివేకా హత్య కేసులో ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిని సీబీఐ(CBI) అధికారులు విచారించారు. సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీచేసిన సీబీఐ ఆయనను ఈరోజు హైదరాబాద్ కార్యాలయానికి పిలిచి విచారించించింది.
హత్యా స్థలంలో దొరికిన లేఖపై ఆయనను సీబీఐ(CBI) అధికారులు విచారించినట్లు సమాచారం. లేఖను ఎందుకు దాచిపెట్టమని చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు సీబీఐ కార్యాలయానికి వచ్చిన రాజశేఖర్‌రెడ్డి విచారణ అనంతరం ఇంటికి వెళ్లారు.
మరోవైపు ఈ కేసులో ఇటీవల అరెస్టైన వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలతో పాటు కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని కూడా సీబీఐ విచారిస్తున్న సమయంలో రాజశేఖర్‌ను CBI విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.