CBI | YCP ఖుష్.. నర్రెడ్డినీ విచారించిన సీబీఐ

CBI విధాత‌: వివేకా హత్య కేసులో తాజాగా జరిగిన పరిణామం వైఎస్సార్సీపీ కాంగ్రెస్‌కు కాస్త ఊరటను ఇచ్చింది. మొదటి నుంచీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి లక్ష్యంగానే దర్యాప్తు జరుగుతుందని, అసలు ఆయనకు వివేకతో ఎలాంటి వైరమూ, విభేదాలు లేవని, అలాంటపుడు వివేకాను చంపే అవసరం అవినాష్‌కు ఎందుకు ఉంటుందన్నది వారి వాదన. అదే క్రమంలో వివేకాతో ఆస్తుల గొడవ , ఆయన షమీమ్ అనే ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవడం వివేకా కుమార్తె సునీతకు, ఆమె […]

  • Publish Date - April 23, 2023 / 05:22 AM IST

CBI

విధాత‌: వివేకా హత్య కేసులో తాజాగా జరిగిన పరిణామం వైఎస్సార్సీపీ కాంగ్రెస్‌కు కాస్త ఊరటను ఇచ్చింది. మొదటి నుంచీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి లక్ష్యంగానే దర్యాప్తు జరుగుతుందని, అసలు ఆయనకు వివేకతో ఎలాంటి వైరమూ, విభేదాలు లేవని, అలాంటపుడు వివేకాను చంపే అవసరం అవినాష్‌కు ఎందుకు ఉంటుందన్నది వారి వాదన.

అదే క్రమంలో వివేకాతో ఆస్తుల గొడవ , ఆయన షమీమ్ అనే ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవడం వివేకా కుమార్తె సునీతకు, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి అసలు ఇష్టం లేదని, వారి దృష్టి అంటా వివేకా ఆస్తులు, ఆయన పదవుల మీదనే ఉందనేది అవినాష్ రెడ్డి శిబిరం ఆరోపణ. అంతే కాకుండా ఈ కేసులోకి నర్రెడ్డిని ఎందుకు విచారించలేదని మొదటి నుంచీ వారు సీబీఐ(CBI)ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే సీబీఐ శనివారం నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని సైతం ప్రశ్నించింది. అసలు హత్య జరిగిన రోజు ఏమి జరిగింది.. మీకు ఎలా సమాచారం వచ్చింది.. సమాచారం రాగానే మీరెలా స్పందించారు. వివేకాతో ఉన్న ఆర్థిక, ఆస్తుల గొడవ గురించి కూడా సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది.

ఇదే తరుణంలో వివేకా రెండో భార్య షమీమ్ సైతం సీబీఐని కలిసి తన వాంగ్మూలం ఇచ్చారు. తన పెళ్ళికి నర్రెడ్డి , సునీత తదితరులు అంగీకరించలేదని, తనకు ఆస్థి ఇవ్వడాన్ని వారు ఒప్పుకోలేదని వాళ్ళే తన భర్తను దూరం పెట్టారని ఆమె సీబీఐకి వివరించారు.

ఇది కూడా వైసిపి శిబిరానికి కాస్త ఊరటను ఇచ్చే అంశమే అయింది. మరోవైపు నర్రెడ్డిని విచారించడంతో కాస్త కేసులోకి సునీతను, ఆమె భర్తను సైతం లాగినట్లు అయిందని అంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈనెలాఖరులోపు విచారణ పూర్తి చేసే పనిలో సీబీఐ ఉంది.