చెప్పిన సమయానికి బాండ్ల వివరాలు వెల్లడిస్తాం: సీఈసీ రాజీవ్‌కుమార్‌ స్పష్టీకరణ

ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం షేర్‌ చేస్తుందని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ బుధవారం చెప్పారు

  • Publish Date - March 13, 2024 / 05:02 PM IST

న్యూఢిల్లీ : ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం షేర్‌ చేస్తుందని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ బుధవారం చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధతపై సమీక్షించిన రాజీవ్‌కుమార్‌.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించి ఎస్‌బీఐ నుంచి వివరాలను తాము అందుకున్నామని చెప్పారు. మాకు మూడు మూలస్థంభాలు.. వెల్లడించడం.. వెల్లడించడం.. వెల్లడించడం. ప్రతి విషయాన్ని ప్రజలకు వెల్లడిస్తాం. కమిషన్‌ పారదర్శకంగానే ఉంటుంది. అనుకున్న సమయానికల్లా ఎస్‌బీఐ మాకు వివరాలు అందించింది. మేం వాటిని అనుకున్న సమయానికి వెల్లడిస్తాం’ అని తెలిపారు.

2019 ఏప్రిల్‌ 12న ఈ స్కీం ప్రారంభమైన దగ్గర నుంచి జరిగిన ఎలక్టోరల్‌ బాండ్ల కొనుగోళ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి మార్చి 12వ తేదీ నాటికి సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించగా.. దానిని పాటిస్తూ ఆ వివరాలను ఎస్‌బీఐ అందించింది. వాటిని కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 15వ తేదీ సాయంత్ర ఐదు గంటలకల్లా తన వెబ్‌సైట్‌లో ప్రదర్శించాల్సి ఉన్నది.