ఉద్యోగులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. 4శాతం DA పెంపు..!

DA | ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కరువు భత్యాన్ని నాలుగు శాతం పెంచనున్నట్లు సమాచారం. ఫలితంగా 38శాతంగా ఉన్న కరువు భత్యం 42శాతానికి చేరనున్నది. పెంచిన డీఏను ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి వర్తింపజేయనునున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో దాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలుగనున్నది. ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ పరిశ్రమ కార్మికులకు (CPI-IW) వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా లెక్కించనున్నారు. 2022 డిసెంబర్‌కు సంబంధించిన పరిశ్రమ […]

  • Publish Date - February 5, 2023 / 04:27 PM IST

DA | ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కరువు భత్యాన్ని నాలుగు శాతం పెంచనున్నట్లు సమాచారం. ఫలితంగా 38శాతంగా ఉన్న కరువు భత్యం 42శాతానికి చేరనున్నది. పెంచిన డీఏను ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి వర్తింపజేయనునున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో దాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలుగనున్నది.

ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ పరిశ్రమ కార్మికులకు (CPI-IW) వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా లెక్కించనున్నారు. 2022 డిసెంబర్‌కు సంబంధించిన పరిశ్రమ కార్మికుల ద్రవ్యోల్బణ నివేదికను గత నెల 31న కార్మిక శాఖ విడుదల చేసింది. అందులో ఉన్న ద్రవ్యోల్బణం లెక్కల ప్రకారం చూస్తే 4.23శాతం డీఏ ఇవ్వాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం డిసెమల్‌ పాయింట్‌ను పరిగణలోకి తీసుకోవడం లేదు.

ఈ పరిస్థితుల్లో డీఏ 4శాతం పెరిగి 42శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నట్లు ఆల్‌ ఇండియా రెల్వేమెన్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్‌ మిశ్రా పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కేంద్రం 4శాతం డీఏ పెంచడంతో 38శాతానికి చేరింది. పెంచిన డీఏను జూలై 2021 నుంచి వర్తింపజేసిన విషయం తెలిసిందే. డియర్‌నెస్ అలవెన్స్‌పై ఏడాదికి రెండుస్లారు సమీక్ష జరుగుతుంది. జనవరి, జూలైలో జరుగుతూ వస్తున్నది.