Chandrababu | జైలే బాబుకు భద్రత.. హౌస్ కస్టడి పిటిషన్ కొట్టివేత

Chandrababu రేపు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై వాదనలు విధాత, విజయవాడ: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడి జ్యూడిషియల్ కస్టడిని హౌస్ కస్టడిగా మార్చాలన్న చంద్రబాబు తరపు పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు హౌస్ కస్టడి పిటిషన్‌పై అటు చంద్రబాబు తరపు న్యాయవాదులు, ఇటు సీఐడీ తరపు న్యాయవాదులు వినిపించిన సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్టు సాయంత్రం 4.30గంటలకు తీర్పు వెల్లడించింది. ఇంటి కంటే […]

  • Publish Date - September 12, 2023 / 01:36 PM IST

Chandrababu

  • రేపు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై వాదనలు

విధాత, విజయవాడ: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడి జ్యూడిషియల్ కస్టడిని హౌస్ కస్టడిగా మార్చాలన్న చంద్రబాబు తరపు పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు హౌస్ కస్టడి పిటిషన్‌పై అటు చంద్రబాబు తరపు న్యాయవాదులు, ఇటు సీఐడీ తరపు న్యాయవాదులు వినిపించిన సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్టు సాయంత్రం 4.30గంటలకు తీర్పు వెల్లడించింది.

ఇంటి కంటే జైలులోనే భద్రత ఎక్కువని భావిస్తున్నట్లుగా న్యాయమూర్తి పేర్కోన్నారు. ఎన్‌ఎస్‌జీ రక్షణలో ఉండే వ్యక్తికి ఓ ఇంటి వద్ధ ఆ స్థాయి భద్రత కల్పించలేమంటూ హౌస్ రిమాండ్ పిటిషన్‌ను కొట్టి వేసింది. బాబు తరపు న సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్ద లూథ్రా తన వాదనలు వినిపిస్తూ భద్రత కోణంలో కరడు గట్టిన నేరస్తులు ఉండే చోట చంద్రబాబును జైలులో ఉంచడం మంచిది కాదని, ఆయన కస్టడీని హౌస్ కస్టడిగా మార్చాలని కోరారు.

అయితే సీఐడీ తరుపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో స్నేహ బరాక్‌లో చంద్రబాబుకు కల్పించిన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను వివరించి జైలులోనే బాబుకు భధ్రత ఉంటుందని వాదించారు. మందులు, ఇంటి భోజనం సరాఫరాపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి హిమబిందు సీఐడీ న్యాయవాది వాదనతో ఏకీభవిస్తూ చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ను కొట్టివేశారు. మందులు, ఇంటి భోజనం సరఫరాకు అనమతిస్తు బాబుకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని ఆదేశించింది.

రేపు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై వాదనలు

చంద్రబాబును ఐదు రోజులపాటు సీఐడీ కస్టడికి ఇవ్వాలని కోరుతూ సీఐడీ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. హౌస్ కస్టడీ పిటిషన్‌తో పాటు సీఐడీ కస్టడి పీటిషన్‌పై కూడా మంగళవారం వాదనలు వింటామని న్యాయమూర్తి చెప్పినప్పటికి తమకు కేసు పత్రాల పరిశీలనకు సమయం కావాల్సి వున్నందునా బుధవారం తమ వాదనలు వినిపిస్తామని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ద లూథ్రా అభ్యర్ధించారు.

ఇందుకు జడ్జీ అనుమతించడంతో బాబు హౌస్ కస్టడి పిటిషన్‌పై తీర్పు వెలువడగానే, సీఐడీ కస్టడీ పిటిషన్ వాదనల కోసం లూథ్రా బృందం స్కిల్ డెవలప్ మెంట్ కేసు పత్రాలను పరిశీలించింది. చంద్రబాబును ఐదు రోజుల కస్టడి కోరుతూ సీఐటీ వేసిన పిటిషన్ పై బుధవారం మరోసారి సీఐడీ న్యాయవాదులకు, బాబు న్యాయవాదులకు వాడి వేడి వాదోపవాదాలు సాగనున్నాయి.

హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు..నేడు విచారణ

చంద్రబాబుపై మోపబడిన స్కిల్ డెవలప్ మెంటు కేసును కొట్టివేయాలని లేదా స్టే ఇవ్వాలని, రిమాండ్ రద్దు చేయాలని కోరుతూ బాబు తరుపు న్యాయవాదులు మంగళవారం ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో బాబుకు బెయిల్ దొరికితే మరో మూడు కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేసేందుకు సీఐడీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందు బాబు లాయర్ల బృందం అన్ని కేసుల్లోనూ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ కేసుల్లో ఇప్పటికే సీఐడీ చంద్రబాబుకు నోటీస్‌లు జారీ చేసింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 1గా, అంగళ్ల అల్లర్ల కేసులో ఏ1, విజయనగరం కేసులో సెక్షన్ 307కింద చంద్రబాబుపై కేసులు నమోదై ఉన్నాయి. వాటిన్నింటిలో చంద్రబాబుకు బెయిల్ సాధించేందుకు ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా బాబు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. అటు ఏసీబీ కోర్టులో బాబు సీఐడీ కస్టడి పిటిషన్‌, ఇటు హైకోర్టులో నాలుగు కేసుల్లో బెయిల్ పిటిషన్ల విచారణ జరుగనున్న నేపధ్యంలో బాబుకు బెయిల్ లభిస్తుందా లేదా అన్నదానిపై టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

జడ్జీ హిమబిందుకు 4+1భద్రత

చంద్రబాబు కేసు విచారిస్తున్న విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందుకు ఏపీ ప్రభుత్వం 4+1భద్రత కల్పించింది. గతంలో ఉన్న భద్రతను ఈ మేరకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.