పవన్‌కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ.. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు
విధాత, విజయవాడ: ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. విజయవాడ నోవాటెల్ హోటల్‌లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. పార్టీ ఆఫీసులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత పవన్ కల్యాణ్.. నోవాటెల్ హోటల్‌కు వచ్చారు. విశాఖ ఘటనల అంశంపై సంఘిభావం తెలిపేందుకు చంద్రబాబు హోటల్‌కు వచ్చారు. వారిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఏపీలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఇరువురూ ఉమ్మడి […]

విధాత, విజయవాడ: ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. విజయవాడ నోవాటెల్ హోటల్‌లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. పార్టీ ఆఫీసులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత పవన్ కల్యాణ్.. నోవాటెల్ హోటల్‌కు వచ్చారు.
విశాఖ ఘటనల అంశంపై సంఘిభావం తెలిపేందుకు చంద్రబాబు హోటల్‌కు వచ్చారు. వారిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఏపీలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఇరువురూ ఉమ్మడి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే పొత్తు దిశగా చంద్రబాబు – పవన్ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. బీజేపీకి ఊడిగం చేయాల్సిన అవసరం లేదని.. పవన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇరువురు భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే.. ప్రస్తుతం పవన్, చంద్రబాబు మధ్య భేటీ రాజకీయ పొత్తుల గురించి కాదని.. జనసేన, టీడీపీ వర్గాలు చెబుతున్నారు. విశాఖలో పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్న తీరు.. ప్రజాస్వామ్య పోరాటాల విషయంలో ఏపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేయడంపై వారు మాట్లాడుకున్నారని అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు పవన్ కల్యాణ్ ఖండించారు.

అలాగే పలువురు టీడీపీ నేతలపై దాడి చేసినప్పుడు ఖండించారు. అందుకే చంద్రబాబు పవన్ కల్యాణ్‌కు సంఘిభావం తెలిపేందుకు ప్రత్యేకంగా సమావేశమయ్యారని చెబుతున్నారు.

ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్, నాగేంద్ర బాబు కూడా పాల్గొన్నారు. వైఎస్ఆర్‌సీపీ దాష్టీకాలను ఎదుర్కోవాలంటే కలసి పోరాడాల్సిందేనన్న అభిప్రాయానికి అందరూ వచ్చినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ ఉంటుందని చివరి క్షణం వరకూ ఎవరికీ తెలియదు. చంద్రబాబు నోవాటెల్ హోటల్‌కు వచ్చిన తర్వాతనే అందరికీ తెలిసింది.
