దాచుకున్న డ‌బ్బుతో ప‌నిమనిషికి ఫోన్‌.. ఓ చిన్నారి దాతృత్వం

ఇళ్ల‌ల్లో ప‌నిచేసే వారిని చాలా మంది చిన్న చూపు చూస్తుంటారు. ఏదో డ‌బ్బు కోసం త‌మ వ‌ద్ద ప‌నిచేస్తున్నార‌ని.. వారు త‌మ‌తో స‌మానం కాద‌నే అహంకారం ఎక్కువ‌గా ఉంటుంది.

దాచుకున్న డ‌బ్బుతో ప‌నిమనిషికి ఫోన్‌.. ఓ చిన్నారి దాతృత్వం

ఇళ్ల‌ల్లో ప‌నిచేసే వారి (Home Maids) ని చాలా మంది చిన్న చూపు చూస్తుంటారు. ఏదో డ‌బ్బు కోసం త‌మ వ‌ద్ద ప‌నిచేస్తున్నార‌ని.. వారు త‌మ‌తో స‌మానం కాద‌నే అహంకారం ఎక్కువ‌గా ఉంటుంది. కొద్ది మంది మాత్ర‌మే వారిని గౌర‌వంతో ఆద‌రిస్తూ స‌హృద్భావంతో మెలుగుతారు. అలాంటి సంస్కారానికి ఉదాహ‌ర‌ణ‌గా నిలిచే ఒక అద్భుత‌మైన ఘ‌ట‌న ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతోంది.


ఆ ఇంట్లో పిల్ల‌వాడికి, ప‌ని మ‌నిషికి ఉన‌న చ‌క్క‌టి అనుబంధాన్ని ఈ ఘ‌ట‌న క‌ళ్ల‌కు క‌ట్టింది. వీ బాలాజీ అనే వ్య‌క్తి త‌న ఇంట్లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. త‌న కుమారుడు అంకిత్‌.. వివిధ టోర్న‌మెంట్‌ల‌లో గెలుచుకున్న డ‌బ్బుతో త‌మ ఇంట్లో ప‌నిచేసే మ‌హిళ‌కు ఫోన్ కొనిచ్చాడ‌ని ఆయ‌న రాసుకొచ్చారు.


కాగా.. రూ.2 వేల‌తో ఫోన్ కొని ఆవిడ‌కు ఇస్తాన‌న‌డంతో త‌న ఆనందానికి అంతు లేకుండా పోయింద‌ని బాలాజీ రాశారు. ఆమె పేరు స‌రోజ కాగా ఆవిడకు అంకిత్ ఫోన్ అందిస్తున్న ఫొటోను ఆయ‌న ట్వీట్‌కు జ‌త చేశారు. ‘ఆమె వాడికి (అంకిత్‌)కు 6 నెల‌ల వ‌యసున్న‌ప్ప‌టి నుంచి ఆల‌నాపాల‌నా చూస్తోంది. ఇది కృత‌జ్ఞ‌త తీర్చుకోవ‌డమేమో’ అని బాలాజీ ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఈ పోస్ట్‌పై ప‌లువురు యూజ‌ర్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ పిల్లాడు ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. ఇలాంటి పెంప‌కాన్ని ఇచ్చిన త‌ల్లిదండ్రుల‌కు అభినంద‌న‌లు అని ఒక‌రు ట్వీట్ చేశారు. పిల్ల‌ల‌కు ఏది అత్యంత అవ‌స‌ర‌మో అది మీరు ఇచ్చారు. ఇదే కావాల‌ని అని మ‌రో యూజ‌ర్ అన్నారు. ఆ ఇద్ద‌రి క‌ళ్ల‌ల్లోనూ ఒక మెరుపు క‌న‌ప‌డుతోంది. ఇదే ఆనందం అంటే. ఇదే మ‌న‌కు ధ‌ర్మం నేర్పించేది అని ఒక యూజ‌ర్ వ్యాఖ్యానించారు.