చిలీలో కార్చిచ్చు 30వేల ఎకరాల్లో బూడిదైన అటవీ ప్రాంతం.. 13 మంది మృత్యువాత..

Chile Wildfire | దక్షిణ అమెరికా దేశమైన చిలీ అడవుల్లో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. మంటల ధాటికి ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయగా.. దాదాపు 35వేల ఎకరాలకు పైగా అడవి బూడిదైంది. అగ్నిప్రమాదాన్ని చిలీ ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. అడవుల్లో అంటుకున్న మంటల కారణంగా దేశవ్యాప్తంగా వేడిగాలులు వీస్తున్నాయి. రాజధాని శాంటియాగోకు దక్షిణంగా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయోబియో ప్రాంతంలోని శాంటా జువానాలో అగ్నిమాపక సిబ్బందితో సహా 11 మంది మరణించారు. […]

చిలీలో కార్చిచ్చు 30వేల ఎకరాల్లో బూడిదైన అటవీ ప్రాంతం.. 13 మంది మృత్యువాత..

Chile Wildfire | దక్షిణ అమెరికా దేశమైన చిలీ అడవుల్లో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. మంటల ధాటికి ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయగా.. దాదాపు 35వేల ఎకరాలకు పైగా అడవి బూడిదైంది. అగ్నిప్రమాదాన్ని చిలీ ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. అడవుల్లో అంటుకున్న మంటల కారణంగా దేశవ్యాప్తంగా వేడిగాలులు వీస్తున్నాయి. రాజధాని శాంటియాగోకు దక్షిణంగా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయోబియో ప్రాంతంలోని శాంటా జువానాలో అగ్నిమాపక సిబ్బందితో సహా 11 మంది మరణించారు. చిలీలోని దక్షిణ ప్రాంతంలో సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో పైలట్, మెకానిక్ మరణించినట్లు వార్తలున్నాయి.

బయోబియో, నుబల్ ప్రాంతాల్లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి, ఆ ప్రాంతంలో సైన్యాన్ని మోహరించారు. చిలీలోని దాదాపు 12 ప్రాంతాల్లో అడవుల్లో మంటలు చెలరేగాయి. ఇప్పటి వరకు వందలాది కార్చిచ్చులో కాలిపోయాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని చిలీ అంతర్గత మంత్రి కరోలినా తోహా ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో, ప్రెసిడెంట్ గాబ్రియేల్ బోరిక్ బయోబియో, న్యూబుల్‌లకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో సుమారు 20వేల మంది జనాభా ఉన్నది. బాధితులను శిబిరాలకు తరలించారు. అయితే, అడవులకు ఉద్దేశపూర్వకంగానే నిప్పుపెట్టారని చిలీ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో చిలీలో ఈ ప్రాంతంలో బలమైన గాలులు వీస్తాయని, దీని కారణంగా రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.