Christmas 2023 Movies :క్రిస్మ‌స్‌కి బాక్సాఫీస్ ఫైటింగ్ మాములుగా లేదు.. బ‌రిలోకి అన్ని పాన్ ఇండియా చిత్రాలే..!

Christmas 2023 Movies : ఇటీవ‌ల పెద్ద సినిమాల సంద‌డి కనిపించ‌డం లేదు. బ‌డా సినిమాల‌న్నీ ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉండ‌డంతో చిన్న సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క్యూ క‌ట్టాయి. ఇందులో కొన్ని సినిమాలు మంచి విజయాన్ని సాధించ‌గా, మ‌రికొన్ని నిరాశ‌ప‌రిచాయి. అయితే ఇప్పుడు పెద్ద సినిమాల షూటింగ్స్ అన్నీ దాదాపు పూర్తి కావొస్తుండ‌గా, ఇవ‌న్నీ క్రిస్‌మ‌స్‌కి ఖ‌ర్చీఫ్ వేసుకున్న‌ట్టు క‌నిపిస్తుంది. ఈ క్రిస్మ‌స్‌కి బాక్సాఫీస దగ్గ‌ర బ‌డా చిత్రాలు పెద్ద ఎత్తున పోటీ ప‌డ‌బోతున్నాయి. ఆ సినిమాలేంట‌నేది చూస్తే.. […]

  • Publish Date - July 24, 2023 / 07:30 AM IST

Christmas 2023 Movies : ఇటీవ‌ల పెద్ద సినిమాల సంద‌డి కనిపించ‌డం లేదు. బ‌డా సినిమాల‌న్నీ ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉండ‌డంతో చిన్న సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క్యూ క‌ట్టాయి. ఇందులో కొన్ని సినిమాలు మంచి విజయాన్ని సాధించ‌గా, మ‌రికొన్ని నిరాశ‌ప‌రిచాయి. అయితే ఇప్పుడు పెద్ద సినిమాల షూటింగ్స్ అన్నీ దాదాపు పూర్తి కావొస్తుండ‌గా, ఇవ‌న్నీ క్రిస్‌మ‌స్‌కి ఖ‌ర్చీఫ్ వేసుకున్న‌ట్టు క‌నిపిస్తుంది. ఈ క్రిస్మ‌స్‌కి బాక్సాఫీస దగ్గ‌ర బ‌డా చిత్రాలు పెద్ద ఎత్తున పోటీ ప‌డ‌బోతున్నాయి. ఆ సినిమాలేంట‌నేది చూస్తే.. నాని న‌టించ‌న ‘హాయ్ నాన్న చిత్రం క్రిస్మ‌స్ బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మైంది. ఈ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలోకి రానున్న‌ట్టు ఇటీవ‌ల మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇందులో నాని స‌ర‌స‌న‌ ‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తుంది.

ఇక టాలీవుడ్ సీనియ‌ర్ హీరో విక్టరీ వెంక‌టేష్ క్రిస్మస్ బరిలోకి ‘సైంధవ్ అనే చిత్రంతో దిగ‌బోతున్నాడు. శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాని డిసెంబర్ 22న సినిమా విడుద‌ల చేయ‌నున్నారు. వెంకీ 75వ సినిమాగా రూపొందినీ చిత్రాన్ని మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందించిన‌ట్టు తెలుస్తుంది. ఇక మ‌హేష్ బావ‌ సుధీర్ బాబు ‘హరోం హర’ కూడా డిసెంబర్ 22న క్రిస్మ‌స్ కానుక‌గా విడుదల కానుంది.ఇటీవ‌ల విడుద‌లైన వీడియాలో సుధీర్ బాబు.. ‘అందరూ పవర్ కోసం గన్ను పట్టుకుంటారు. కానీ, ఇది యాడెడో తిరిగి నన్ను పట్టుకుంది’ అంటూ ఆయ‌న చెప్పిన డైలాగ్ మూవీపై అంచ‌నాలు పెంచింది. ఇక నితిన్ తాజా చిత్రం ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్ డిసెంబర్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ‘కిక్’ తర్వాత తాను ఆ జానర్ స్క్రిప్ట్ రాశానని దర్శకుడు వక్కంతం వంశీ చెప్ప‌డంతో మూవీపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

ఇక ఈ ఏడాది క్రిస్మ‌స్ కి బాక్సాఫీస్ వద్ద ర‌చ్చ చేయ‌నున్న మ‌రో చిత్రం ‘డుంకి. కింగ్ ఖాన్ షారుఖ్ నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22నే బాక్సాఫీస్ వ‌ద్ద‌ దండయాత్రకి రెడీ అవుతోంది. క్రేజీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుండ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ప‌ఠాన్ లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత రానున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని అల‌రించేలా ఉంటుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఈ చిత్రాలు క్రిస్మ‌స్ బ‌రిలో దిగుతుండ‌గా, రానున్న రోజుల‌లో ఇంకెన్ని చిత్రాలు ఈ లిస్ట్‌లో చేర‌తాయో చూడాలి.

Latest News