Bastar | ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ముగ్గురు డీఆర్‌జీ(DRG) సిబ్బంది వీరమరణం చెందారు. మృతుల్లో ఏఎస్‌ఐ రామురామ్‌నాగ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజం జోగా, కానిస్టేబుల్ వనం భీమా ఉన్నారు.
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ పేర్కొన్నారు. ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతున్ని కోరుకుంటున్నానన్నారు. వారి బలిదానం వృథా కాదన్నారు.
బస్తర్‌లోని సుక్మా జిల్లా జాగర్‌గుండా, కుండేడ్ మధ్య డీఆర్‌జీ పార్టీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డీఆర్‌జీ బృందం, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు వీరమణం పొందగా.. ఇద్దరు జవాన్లు గాయపడ్డట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.