Karnataka results | ఓటమిని అంగీకరించిన బీజేపీ.. లోతైన పరిశీలన చేసుకుంటాం: సీఎం బస్వరాజు బొమ్మై
Karnataka results | విధాత: కర్ణాటకలో ఓటమిని బీజేపీ అంగీకరించింది. తాము ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయామని తెలిపింది. ఓటమికి గల కారణాలను తెలుసుకుంటామని, లోతైన ఆత్మ పరిశీలన చేసుకుంటామని బీజేపీ నేత, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై చెప్పారు. కర్ణాటక ఫలితాలపై ఆయన శనివారం మధ్యాహ్నం స్పందించారు. జాతీయ పార్టీగా వివిధ స్థాయిల్లో ఎలాంటి లోటుపాట్లు, అంతరాలు జరిగాయో విశ్లేషించడమే కాకుండా, ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఈ ఓటమిని గెలుపునకు పునాదిగా భావిస్తామని పేర్కొన్నారు.

Karnataka results |
విధాత: కర్ణాటకలో ఓటమిని బీజేపీ అంగీకరించింది. తాము ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయామని తెలిపింది. ఓటమికి గల కారణాలను తెలుసుకుంటామని, లోతైన ఆత్మ పరిశీలన చేసుకుంటామని బీజేపీ నేత, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై చెప్పారు.
కర్ణాటక ఫలితాలపై ఆయన శనివారం మధ్యాహ్నం స్పందించారు. జాతీయ పార్టీగా వివిధ స్థాయిల్లో ఎలాంటి లోటుపాట్లు, అంతరాలు జరిగాయో విశ్లేషించడమే కాకుండా, ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఈ ఓటమిని గెలుపునకు పునాదిగా భావిస్తామని పేర్కొన్నారు.