ఏపీలో 20రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్: సీఎం జగన్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 20రోజుల ముందే రావచ్చని, ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

విధాత: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 20రోజుల ముందే రావచ్చని, ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఏపీ కేబినెట్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా, జగన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
గత అసెంబ్లీ ఎన్నికల సమయంతో పోల్చితే 20రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశముందన్నారు. మార్చే, ఏప్రిల్ నెలలో కరెంటు కోతలు ఉండే అవకాశం ఉందని, అందుకే ఫిబ్రవరిలోనే ఎన్నికలు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోగా అన్ని పథకాలు, కార్యక్రమాలు పూర్తి కావాలని మంత్రులకు దిశా నిర్ధేశం చేశారు.