CM KCR | సింగరాచార్యుల మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
CM KCR | విధాత : ప్రముఖ తెలుగు, సంస్కృత భాషా పండితులు కండ్లకుంట అళహ సింగరాచార్యుల మృతి పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సింగరాచార్యులు భాషా సాహిత్య రంగాలకు విశేష కృషి చేశారని, అధ్యాపకులుగా, ఉపన్యాసకులుగా, రచయితగా, వ్యాకరణ పండితుడిగా తెలుగు, సంస్కృత భాషలకు వారు చేసిన సేవలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి కుమారుడు ఎడిటర్ కె. శ్రీనివాస్ సహా […]

CM KCR | విధాత : ప్రముఖ తెలుగు, సంస్కృత భాషా పండితులు కండ్లకుంట అళహ సింగరాచార్యుల మృతి పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సింగరాచార్యులు భాషా సాహిత్య రంగాలకు విశేష కృషి చేశారని, అధ్యాపకులుగా, ఉపన్యాసకులుగా, రచయితగా, వ్యాకరణ పండితుడిగా తెలుగు, సంస్కృత భాషలకు వారు చేసిన సేవలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి కుమారుడు ఎడిటర్ కె. శ్రీనివాస్ సహా కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.
ప్రముఖ తెలుగు, సంస్కృత భాషా పండితులు శ్రీ కండ్లకుంట అళహ సింగరాచార్యుల మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీ సింగరాచార్యుల భాషాసాహిత్య కృషిని, అధ్యాపకులుగా, ఉపన్యాసకులుగా, రచయితగా, వ్యాకరణ పండితుడిగా తెలుగు సంస్కృత…
— Telangana CMO (@TelanganaCMO) August 14, 2023