CM KCR | పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకం అమలుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

తాగునీటి పనులకు సుప్రీం అనుమతిచ్చింది జూలై వరకు పనులు పూర్తి చేయండి అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్‌ నూతన సచివాలయంలో మొదటి రోజు సీఎం విధాత: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రారంభమైన మొదటి రోజునే నూతన సచివాలయానికి వచ్చారు. ఆదివారం నాడు ప్రారంభమైన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మొదటి రోజున, మొట్టమొదట పాలమూరు - రంగారెడ్డి ఎత్తి పోతల పథకం అమలు తీరుపై, తాగునీటి కోసం చేపట్టిన పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ (CM KCR) […]

  • Publish Date - May 1, 2023 / 09:43 AM IST
  • తాగునీటి పనులకు సుప్రీం అనుమతిచ్చింది
  • జూలై వరకు పనులు పూర్తి చేయండి
  • అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్‌
  • నూతన సచివాలయంలో మొదటి రోజు సీఎం

విధాత: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రారంభమైన మొదటి రోజునే నూతన సచివాలయానికి వచ్చారు. ఆదివారం నాడు ప్రారంభమైన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మొదటి రోజున, మొట్టమొదట పాలమూరు – రంగారెడ్డి ఎత్తి పోతల పథకం అమలు తీరుపై, తాగునీటి కోసం చేపట్టిన పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ (CM KCR) ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జ‌రిగింది.

సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించడానికి అనుమతించిన నేపథ్యంలో సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతి పై ముఖ్యమంత్రి కూలంకంషంగా చర్చించారు. ఇందులో భాగంగా జూలై వరకు కరివెన జలాశయంకు నీళ్ళు తరలించాలని, ఆగష్టు వరకు ఉద్దండపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండపూర్ జలాశయాలకు సంబంధించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వాటి సంబంధిత పంప్ హౌజ్ లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, ఒక రిజర్వాయర్‌ నుంచి మరొక రిజర్వాయర్ కు నీటిని తరలించే ‘కన్వేయర్ సిస్టమ్’ లో మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతి పై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. వాటిలో మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో.. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి. ఎంపీలు పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి. ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, కాలె యాదయ్య, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, అంజయ్య యాదవ్, ప్రకాశ్ గౌడ్, మహేష్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి.

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్; స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, ఈఎన్సీ మురళీధర్ రావు, అడ్వైజర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెంటారెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి; ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సీఈ లు హమీద్ ఖాన్, ధర్మా, ఎస్ఈ లు రంగారెడ్డి, శ్రీనివాస్, విజయ భాస్కర్ రెడ్డి, చక్రధర్ , ఎఎస్ఎన్ రెడ్డి, ట్రాన్స్ కో డైరక్టర్ సూర్య ప్రకాశ్, డిఈ పిఆర్ఎల్ఐఎస్ సయ్యద్ మోయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.