మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి..కాంగ్రెస్‌లోకి ఆహ్వానం

పార్లమెంటు ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి కలవడం హాట్ టాపిక్‌గా మారింది

  • Publish Date - March 14, 2024 / 09:15 AM IST

విధాత, హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి కలవడం హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ మహబూబ్‌నగర్ టికెట్ ఆశించి భంగపడి తీవ్ర అసంతృప్తితో ఉన్న జితేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు రేవంత్‌రెడ్డి స్వయంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించడం విశేషం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి గురువారం జితేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. తన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ బలోపేతంతో పాటు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు సాధనకు జితేందర్‌రెడ్డి చేరిక ఉపకరిస్తుందన్న భావనతో సీఎం రేవంత్‌రెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సమాచారం.