సీఎం రేవంత్ రెడ్డితో నీతి అయోగ్ వైస్ చైర్మన్ భేటీ

సీఎం రేవంత్‌రెడ్డితో నీతి అయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరి, సభ్యులు వి.కె.సారస్వత్‌లు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యారు

సీఎం రేవంత్ రెడ్డితో నీతి అయోగ్ వైస్ చైర్మన్ భేటీ

విధాత: సీఎం రేవంత్‌రెడ్డితో నీతి అయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరి, సభ్యులు వి.కె.సారస్వత్‌లు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి, రాష్ట్ర ప్రణాళిక, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె. రామకృష్ణారావు కూడా ఉన్నారు.


ప్రధానంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న నిధులు, రుణ అంశాలు వంటివాటిపై చర్చించినట్లుగా సమాచారం. త్వరలో 2024-25 రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన చేయనున్న నేపధ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.