CM Revanth Reddy | తెలంగాణ వారసత్వాన్ని సమున్నతంగా నిలపాలనే

ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

  • By: Somu    latest    Feb 05, 2024 10:46 AM IST
CM Revanth Reddy | తెలంగాణ వారసత్వాన్ని సమున్నతంగా నిలపాలనే
  • క్యాబినెట్‌ నిర్ణయాలపై సీఎం రేవంత్‌రెడ్డి


CM Revanth Reddy | హైదరాబాద్‌: ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే ‘జయ జయహే తెలంగాణ..’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ఎంపిక చేశామని సోమవారం ఎక్స్‌లో తెలిపారు. తెలంగాణ గీతం, తెలంగాణ తల్లి విగ్రహం, వాహనాల నంబర్‌ ప్లేట్ల పై టీఎస్‌ బదులు టీజీగా మార్పు తదితర అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో సోమవారం ఆయన ఎక్స్‌లో ఒక పోస్టు చేస్తూ.. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా మలుస్తామని వెల్లడించారు. రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉంటుందని తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్న రేవంత్‌రెడ్డి.. ఆ ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.