అందరి ముందే సాయి ధరమ్ తేజ్‌కి ముద్దు పెట్టిన స్వాతి.. ఏం జరుగుతుంది..!

ఈ మధ్య కాలంలో కొందరు సెలబ్రిటీల ప్రవర్తన అభిమానులతో పాటు మీడియాకి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్టేజ్ పైనే తెగ రొమాన్స్‌లు చేసుకోవడం, ముద్దులు ఇచ్చుకోవడం వంటివి చేస్తూ అందరు షాక్ అయ్యేలా చేస్తున్నారు. తాజాగా కలర్స్ స్వాతి కూడా ఒకవైపు మీడియా మరోవైపు పబ్లిక్ ఉండగా, స్టేజ్‌పై సాయిధరమ్ తేజ్‌కి ముద్దు ఇచ్చింది. ఇది చూసి ఒక్కసారిగా అందరు నోరెళ్లపెట్టారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న మంచి స్నేహం వల్లనే స్వాతి.. తేజూకి అలా కిస్ ఇచ్చింది. కలర్స్’ అనే టీవీ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న స్వాతి ఆ తర్వాత మంచి చిత్రాలు చేసి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్‌గా సత్తా చాటింది. అయితే అమ్మడి కెరీర్ పీక్ రేంజ్ లోకి వెళ్తున్న సమయం లో వికాస్ వాసు అనే మలయాళీ పైలట్ ని పెళ్లి చేసుకొని విదేశాలకి వెళ్లింది.
ఈ క్రమంలో స్వాతి కొన్నాళ్లపాటు సినిమాలకి దూరంగా ఉంది.ఇక ఇప్పుడు తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి తెగ సందడి చేస్తుంది. స్వాతి నటించిన తాజా చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’ అక్టోబర్ 6న విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్‌గా జరగగా, ఈ ఈవెంట్‌కి గెస్ట్‌గా సాయిధరమ్ తేజ్ హాజరయ్యాడు.వేదికపై స్వాతి ని సాయి ధరమ్ తేజ్ స్వాతిగాడు అని పిలవడం, ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు జోకులు వేసుకోవడం, అనంతరం కలర్స్ స్వాతి సాయి ధరమ్ తేజ్ కి ముద్దుపెట్టడం కూడా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఈవెంట్‌లో స్వాతి మాట్లాడుతూ.. మేమిద్దరం కలిసి బీఎస్సీ చదువుకున్నాం. అయితే సినిమాల్లో నా డెబ్యూ ముందు జరిగింది కాబట్టి నేను తనకంటే పెద్దదాన్ని అని అందరు భావిస్తుంటారు. కాని మా ఇద్దరిదీ ఒకే ఏజ్. లాస్ట్ వన్ ఇయర్ లో మేమిద్దరం సత్య అనే ఓ ప్రాజెక్ట్ చేశాం. తేజు నా లైఫ్ లో ఎప్పుడూ ఓ సపోర్ట్ సిస్టమ్ లా ఉంటూ వస్తున్నాడు అని స్వాతి పేర్కొంది. అయితే ఎగ్జామ్స్ లో స్వాతి వెనుకే తాను ఉండేవాడినని చెప్పిన తేజ్.. అస్సలు చూపించకుండా ఎంతో ఏడిపించేదని అన్నాడు. దానికి స్వాతి… తన పేపర్ చూసే తేజ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాడని స్వాతి చెప్పుకొచ్చింది. వీరిద్దరు మాత్రం ఈవెంట్‌లో తెగ సందడి చేశారు.