Divorce | నిహారిక- చైతన్య బాటలో మరో జంట.. అసలు వీళ్లకి ఏమైంది..!
Divorce: ఎంతో ఆర్భాటంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ జంటలు పట్టుమని పదేళ్లు కూడా సంసారం చేయకుండా విడాకుల బాట పడుతున్నారు. సమంత- నాగ చైతన్యలు కొన్నాళ్ల పాటు ప్రేమించుకొని పెద్దలని ఒప్పించుకొని గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఇటలీ వేదికగా మూడు రోజుల పాటు వీరి వివాహం జరిగింది. హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే పెళ్లైన నాలుగేళ్లకే ఇద్దరి మధ్య విబేదాలు రావడంతో విడిపోయారు. చైతన్య సోదరుడు అఖిల్ అయితే ఎంగేజ్‌మెంట్ చేసుకొని పెళ్లి […]

Divorce: ఎంతో ఆర్భాటంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ జంటలు పట్టుమని పదేళ్లు కూడా సంసారం చేయకుండా విడాకుల బాట పడుతున్నారు. సమంత- నాగ చైతన్యలు కొన్నాళ్ల పాటు ప్రేమించుకొని పెద్దలని ఒప్పించుకొని గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఇటలీ వేదికగా మూడు రోజుల పాటు వీరి వివాహం జరిగింది. హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.
అయితే పెళ్లైన నాలుగేళ్లకే ఇద్దరి మధ్య విబేదాలు రావడంతో విడిపోయారు. చైతన్య సోదరుడు అఖిల్ అయితే ఎంగేజ్‌మెంట్ చేసుకొని పెళ్లి వరకు వెళ్లకుండా బ్రేకప్ చెప్పాడు. ఇక చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకోగా, అవి రెండు కూడా పెటాకులు అయినట్టు తెలుస్తుంది.
సమంత- నాగ చైతన్య విడాకుల తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో హాట్ టాపిక్ అయినవి నిహారిక- చైతన్య విడాకులు. వీరిద్దరి పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ మీడియా కూడా వీరి పెళ్లిని కవర్ చేసిందంటే ఎంత ఆర్భాటంగా వీరి వివాహం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే పెళ్లైన మున్నాళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. జూలై 5న ఈ ఇద్దరు తమ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు వీరి బాటలోనే మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. క్యూట్ మాటలతో హోమ్లీ గర్ల్ లుక్స్‌తో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కలర్స్ స్వాతి తాజాగా తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి భర్త ఫొటోలు తొలగించేసింది.
దీంతో స్వాతి కూడా విడాకుల దిశగా అడుగులు వేస్తుందని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. గతంలో సమంత, నిహారిక కూడా ఇలాగే తమ భాగస్వాముల ఫొటోలను సోషల్ మీడియాలోంచి తీసేయడం, కొద్ది రోజులకి విడాకులు ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు స్వాతి కూడా తన భర్త ఫొటోలని ఇలా డిలీట్ చేయడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.
ఇక ఇదిలా ఉంటే సుమారు రెండేళ్ల క్రితం స్వాతి విడాకులు తీసుకుంటోందన్న ప్రచారాలు జోరుగా సాగాయి. అప్పట్లో స్వాతి సడెన్‌గా తన భర్త ఫొటోలు తొలగించడంతో కలకలం రేగింది. ఈ క్రమంలో ఆమె స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.