Congress | ఎంపీ విజయసాయిరెడ్డిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూబ్లీ హిల్స్, బంజారాహీల్స్ పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు.

- ప్రభుత్వం కూలిపోతుందన్న వ్యాఖ్యలపై కేసు నమోదుకు డిమాండ్
Congress | విధాత : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూబ్లీ హిల్స్, బంజారాహీల్స్ పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెల్లలో కూలిపోతుందంటూ రాజ్యసభలో ఆన్ రికార్డ్ లో విజయ్ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చట్టపర చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాల్వ సుజాతా ఫిర్యాదులో కోరారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చూస్తే బీఆరెస్‌తో కలిసి వైసీపీ తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రు చేస్తున్నాయని అనుమానాలున్నాయని దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరారు.
ఏపీ లో జరిగే ఎన్నికలకు వైసీపీకి బీఆరెస్ ఫండింగ్ చేస్తుందని, ఇద్దరు మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందన్నారు. తెలంగాణ లో సుస్థిర పాలన సాగుతుందని, ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వం ముందు విజయ్ సాయి రెడ్డి లాంటి నాయకుల వాఖ్యలు చెల్లుబాటు కావన్నారు. విజయ్ సాయి రెడ్డి వాఖ్యల పై సీబీఐతో విచారణ జరిపించాలని, రాజ్యసభ చైర్మన్ విజయ్ సాయి రెడ్డి వాఖ్యలు పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.