విధాత: తెలుగు ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు లాంటి లెజెండ్ వచ్చిన కుటుంబం అది. ఆయన తర్వాత వారసులు కూడా ఇండస్ట్రీకి వచ్చారు. మంచు విష్ణు, మనోజ్, లక్ష్మి ముగ్గురు కూడా సినిమాలు చేస్తున్నారు. ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు మాత్రం చేస్తూనే ఉన్నారు.
అయితే మంచు బ్రదర్స్ బయట బాగానే ఉంటున్నా.. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని పుకార్లు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదని.. అందుకే మంచు మనోజ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడనేది ఇండస్ట్రీలో ఉన్న టాక్. విష్ణు, మనోజ్ మధ్య దేనికి విభేదాలు వచ్చాయో ఎవరికీ తెలియదు. విష్ణు అమ్మానాన్నలతో ఉంటే.. మనోజ్ మాత్రం విడిగా ఉంటున్నాడు.
అయితే ఇప్పుడు వారి మధ్య వివాదం రోడ్డున పడింది. గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న గొడవలు ఒక్కసారిగా బయట పడ్డాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి అన్న విష్ణు మనోజ్ సహాయకుడు సారథితో జరిగిన గొడవ వీడియోను తన ఫేస్బుక్ స్టేటస్‌లో పెట్టాడు మనోజ్.
మనోజ్ ఫేస్‌బుక్ స్టోరీ పోస్ట్‌తో ఇప్పుడు వారి మధ్య గొడవల గురించి కొత్త చర్చకు దారి తీసింది. వారి మధ్య విబేధాలను బయట పెట్టింది. తన పని మనిషి సారథిని విష్ణు కొట్టాడంటూ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ళలోకి చొరబడి ఇలా కొడుతూ ఉంటాడటూ విష్ణు పై మనోజ్ సీరియస్ అయ్యారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను మనోజ్ తీశాడు. అదిప్పుడు మీడియా కంటపడటంతో తెగ వైరల్ అవుతుంది.
గొడవపై మోహన్ బాబు తీవ్ర ఆగ్రహం.. వీడియో డిలీట్ చేసిన మనోజ్
కాగా.. ఈ గొడవపై నటుడు మంచు మోహన్ బాబు సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాకు ఎందుకు ఎక్కారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గురువారం రాత్రి సారథి ఇంట్లో ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు మోహన్‌బాబు. వీడియో డిలీట్ చెయ్యమని మోహన్‌బాబు చెప్పడంతో ఫేస్‌బుక్ స్టేటస్ డిలీట్ చేశాడు మనోజ్.
ఈ గొడవపై ఓ ఛానల్‌తో మోహన్ బాబు మాట్లాడుతూ అవేశం అన్నిటికీ అనర్థమని.. వాళ్లింకా అది తెలుసుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇరువురికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.
మంచు ఫ్యామిలీకి సన్నిహితంగా సారథి ఉంటూ వస్తున్నాడు. ఈయన మోహన్ బాబుకు వరసకు సోదరుడు అవుతారు. మొదట్లో సారథి.. మా ఎన్నికలలో విష్ణుకు కుడిభుజంలా ఉంటూ వచ్చారు. కాలక్రమేణా విష్ణు నుంచి దూరం జరిగి.. మోహన్ బాబుకు దగ్గరయ్యారు. ఈ మధ్య మంచు మనోజ్‌తో చాలా క్లోజ్‌గా ఉంటూ.. అతడి వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో సారథి ఇంటికెళ్లి అతన్ని కొట్టబోయాడు మంచు విష్ణు