Congress | CLP, PCC చీఫ్‌.. సమక్షంలోనే పొత్తు చర్చలు: ఠాక్రే

Congress | కమ్యూనిస్టుల పొత్తుపై మాణిక్‌రావు ఠాక్రే కీలక ఎన్నికల హామీలపై ప్రజలకు గ్యారెంటీ కార్డు నేడు కాంగ్రెస్ ఎన్నికల భేటీ…దరఖాస్తుల వడపోత విధాత :కమ్యూనిస్టులతో పొత్తు చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని, సీఎల్పీ నేత, పీసీసీ చీఫ్ సమయంలోనే పొత్తుల చర్చలు జరుగుతాయని, అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీపీఐతో అనధికార సమావేశం జరిగిందని, లెఫ్ట్ పార్టీలతో పొత్తులు, సీట్ల […]

  • By: Somu    latest    Aug 28, 2023 12:07 PM IST
Congress | CLP, PCC చీఫ్‌.. సమక్షంలోనే పొత్తు చర్చలు: ఠాక్రే

Congress |

  • కమ్యూనిస్టుల పొత్తుపై మాణిక్‌రావు ఠాక్రే
  • కీలక ఎన్నికల హామీలపై ప్రజలకు గ్యారెంటీ కార్డు
  • నేడు కాంగ్రెస్ ఎన్నికల భేటీ…దరఖాస్తుల వడపోత

విధాత :కమ్యూనిస్టులతో పొత్తు చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని, సీఎల్పీ నేత, పీసీసీ చీఫ్ సమయంలోనే పొత్తుల చర్చలు జరుగుతాయని, అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీపీఐతో అనధికార సమావేశం జరిగిందని, లెఫ్ట్ పార్టీలతో పొత్తులు, సీట్ల కేటాయింపులపై ఇందులో ఎలాంటి చర్చ జరుగలేదన్నారు.

రాష్ట్రంలో పార్టీకి ఉపయోగపడే విషయాలన్ని పీసీసీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే జరుగుతాయన్నారు. తనను ప్రత్యక్షంగా చర్చలు జరుపమని హైకమాండ్ చెప్పలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తామని చాల పార్టీలు ముందుకు వస్తున్నాయని, తనను కలువడానికి చాల మంది వస్తుంటారని, అందులో మంద కృష్ణమాదిగ, ఆర్‌. కృష్ణయ్య సహా ఇతర సంఘాల నేతలు వచ్చారన్నారు. వాళ్లతో మాట్లాడిన సందర్భంలో ఏవేలో అంశాలు ప్రస్తావిస్తే తాను చేసేదేముంటుందన్నారు. కమ్యూనిస్టులతో చర్చలకు..ఆర్.కృష్ణయ్యతో భేటీకి తాను రేవంత్‌, భట్టితో చెప్పాకే వెళ్లినట్లుగా తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం భారీ సంఖ్యలో వచ్చిన దరఖాస్తులపై చర్చించేందుకు నేడు మంగళవారం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమవుతుందన్నారు. ఈ సమావేశంలో దరఖాస్తులపై చర్చించి ప్రతి నియోజకవర్గం నుంచి మూడు పేర్లను స్క్రీనింగ్ కమిటీకి సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు స్థానాలు బీసీలకు కేటాయిస్తామన్నారు.

కాంగ్రెస్ కీలక ఎన్నికల హామీలపై ప్రజలకు గ్యారంటీ కార్డును అందిస్తామని, ఇంటింటికి గ్యారెంటీ కార్డు అందిస్తామని ఠాక్రే వెల్లడించారు. షర్మిల పార్టీ విలీనం అంశం కాంగ్రెస్ హైకమాండ్ పరిధిలో ఉందన్నారు. తెలంగాణలో బీఆరెస్ గ్రాఫ్ పడిపోయిందని, రానున్న ఎన్నికల్లో ఘన విజయంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు