మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ MLC.. హర్షవర్థన్‌రెడ్డికి కాంగ్రెస్‌ మద్దతు

విధాత: మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ (TEACHERS) నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘం నాయకులు గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డికి కాంగ్రెస్‌(CONGRESS) పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించిందని పీసీసీ (PCC) వర్కింగ్‌ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ సంఘం నేత హర్షవర్థన్‌రెడ్డి పార్టీ సీనియర్‌ నేతలను కలిసి అభ్యర్థించారని, ఆయన అభ్యర్థన మేరకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హర్షవర్థన్‌రెడ్డి ఉపాధ్యాయ, విద్య (TEACHERS, EDUCATION) […]

  • Publish Date - February 18, 2023 / 01:45 AM IST

విధాత: మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ (TEACHERS) నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘం నాయకులు గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డికి కాంగ్రెస్‌(CONGRESS) పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించిందని పీసీసీ (PCC) వర్కింగ్‌ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉపాధ్యాయ సంఘం నేత హర్షవర్థన్‌రెడ్డి పార్టీ సీనియర్‌ నేతలను కలిసి అభ్యర్థించారని, ఆయన అభ్యర్థన మేరకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హర్షవర్థన్‌రెడ్డి ఉపాధ్యాయ, విద్య (TEACHERS, EDUCATION) సంబంధిత సమస్యలపై 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని తెలిపారు.

హర్షవర్థన్‌రెడ్డిని గెలిపించేందుకు నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ (MBNR, RR, HYD) జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ నాయకులంతా సమిష్టిగా కృషి చేయాలని కోరారు.