High Court |
విధాత: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో చాలా మంది ప్రజలు వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు పోయి శవాలై తేలగా మరికొంత మంది ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
అయితే రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సుధాకర్, శ్రవణ్‌కుమార్ పిల్ దాఖ చేశారు. పిల్ విచారణను శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం కీలక వ్యాఖ్యాలు చేసింది. రాష్ట్రంలో వరదలలో చిక్కుకొని ఇంతవరకు ఎంత మంది చనిపోయారు ?, ఇప్పటివరకు డిజాస్టర్ చట్టం ప్రకారం ఎంతమంది ని రక్షించారు ? అని ప్రభుత్వాన్ని అడిగింది.
గోదావరి తీర ప్రాంతంలో వరదాలనుండి ఎంత మందిని రక్షించారు ? వరదలో చిక్కుకున్న వారికి కనీస సౌకర్యాలు తక్షణమే కల్పించాలి, కడెం ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ చట్ట ప్రకారం రక్షించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని తెలిపింది. పై విషయాలపై సోమవారం సమగ్ర నివేదిక ను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అస్సలు వరదలపై వార్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ?.
ఎన్నికల కోసం వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నప్పడు వరదల కోసం కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసేందుకు ఎందుకు అంత ఇబ్బందో చెప్పాలన్నారు. ముందుగా పిటిషనర్ తరుఫునా చిక్కుడు ప్రభాకర్, పల్లె ప్రదీప్ కుమార్, న్యాయవాదులు వాదనలు వినిపించారు. సోమవారం లోగా పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశింస్తూ తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.