Gutta Sukhender Reddy | అందరి అభ్యున్నతే.. సీఎం కేసీఆర్ ధ్యేయం: గుత్తా
కులవృత్తి దారులకు లక్ష చెక్కుల పంపిణీ Gutta Sukhender Reddy | విధాత: తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేవరకొండ పట్టణంలోని అంబేడ్కర్ భవన్ లో బీసీ, ఎంబీసీ కుల వృత్తుల లబ్ధిదారులకు 1 లక్ష రూపాయల చెక్కుల పంపిణీ స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుత్తా […]

- కులవృత్తి దారులకు లక్ష చెక్కుల పంపిణీ
Gutta Sukhender Reddy | విధాత: తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేవరకొండ పట్టణంలోని అంబేడ్కర్ భవన్ లో బీసీ, ఎంబీసీ కుల వృత్తుల లబ్ధిదారులకు 1 లక్ష రూపాయల చెక్కుల పంపిణీ స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా బాంధవుడన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కుల వృత్తి చేస్తూ జీవితాన్ని కోససాగిస్తున్న వారికి భరోసాను కల్పిస్తూ వారికి1 లక్ష రూపాయల సహాయం చేయాలనే ఆలోచన గతంలో ఏ ముఖ్యమంత్రి కి రాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిందని, హామీలు ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు.
ప్రతిపక్ష నేతల కంటికి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనబడటం లేదని, వాళ్లు కేవలం ఆరోపణలు, విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే అధికారంలో ఉన్న పార్టీనే మళ్ళీ ఆదరించాలని ఆయన సూచించారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీ రామ రక్ష అని, ఆయనను మూడో సారి ముఖ్యమంత్రి చేసేందుకు అందరు కృషి చేయాలని సుఖేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.