Long Range Revolver | దేశ మొట్టమొదటి లాంగ్ రేంజ్ రివాల్వర్.. ఈ నెల 18నుంచి ‘ప్రబల్’ బుకింగ్స్
Long Range Revolver న్యూఢిల్లీ: భారతదేశపు మొట్టమొదటి దీర్ఘశ్రేణి రివాల్వర్ ‘ప్రబల్’ను ఈ నెల 18న ఆవిష్కరించనున్నారు. దీనిని కాన్పూర్‌లో ఉన్న ప్రభుత్వ ఆధీనంలోని ఆయుధాల తయారీ సంస్థ అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (ఏడబ్ల్యూఈఐఎల్) తయారు చేసింది. తేలికపాటి పాయింట్ 32 బోర్ రివాల్వర్.. 50 మీటర్ల దూరంలోని టార్గెట్‌ను ఛేదించగలదు. ఇప్పటి వరకూ ఉన్న రివాల్వర్‌లతో పోల్చితే ఇది రెట్టింపు కంటే ఎక్కువ దూరం. భారతదేశంలో తయారైన రివాల్వర్లలో మొదటిసారి సైడ్ […]

Long Range Revolver
న్యూఢిల్లీ: భారతదేశపు మొట్టమొదటి దీర్ఘశ్రేణి రివాల్వర్ ‘ప్రబల్’ను ఈ నెల 18న ఆవిష్కరించనున్నారు. దీనిని కాన్పూర్‌లో ఉన్న ప్రభుత్వ ఆధీనంలోని ఆయుధాల తయారీ సంస్థ అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (ఏడబ్ల్యూఈఐఎల్) తయారు చేసింది.
తేలికపాటి పాయింట్ 32 బోర్ రివాల్వర్.. 50 మీటర్ల దూరంలోని టార్గెట్‌ను ఛేదించగలదు. ఇప్పటి వరకూ ఉన్న రివాల్వర్‌లతో పోల్చితే ఇది రెట్టింపు కంటే ఎక్కువ దూరం. భారతదేశంలో తయారైన రివాల్వర్లలో మొదటిసారి సైడ్ స్వింగ్ సిలిండర్ ఉన్నది ఇదే కావడం విశేషం.
దీనిని పేల్చడం కూడా చాలా సులభం కాబట్టి మహిళలకు వారి రక్షణ నిమిత్తం అనువుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆగస్ట్ 18 నుంచి బుకింగ్స్ ఓపెన్ అవుతాయని, గన్ లైసెన్స్ ఉన్న భారతీయులు దీనిని కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నది.