Crime News | వివాహేత‌ర సంబంధం.. భ‌ర్త‌ను చెట్టుకు క‌ట్టేసి నిప్పంటించిన భార్య‌

Crime News | వివాహేత‌ర సంబంధానికి అడ్డు వ‌స్తున్న భ‌ర్త‌ను మ‌ట్టుబెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న భార్య‌.. తెలివిగా అత‌న్ని చంపాల‌నుకుంది సెల్ఫీ తీసుకుందామంటూ పిలిచి.. ఓ చెట్టుకు క‌ట్టేసింది. ఆ త‌ర్వాత అత‌నిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దారుణ ఘ‌ట‌న బీహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పుర్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ముజ‌ఫ‌ర్‌పుర్ జిల్లాలోని వాసుదేవ్‌పూర్ స‌రాయ్ గ్రామానికి చెందిన ఓ 25 ఏండ్ల మ‌హిళ త‌న భ‌ర్త‌తో క‌లిసి ఉంటోంది. అయితే గ్రామానికి చెందిన మ‌రో వ్య‌క్తితో […]

Crime News | వివాహేత‌ర సంబంధం.. భ‌ర్త‌ను చెట్టుకు క‌ట్టేసి నిప్పంటించిన భార్య‌

Crime News | వివాహేత‌ర సంబంధానికి అడ్డు వ‌స్తున్న భ‌ర్త‌ను మ‌ట్టుబెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న భార్య‌.. తెలివిగా అత‌న్ని చంపాల‌నుకుంది సెల్ఫీ తీసుకుందామంటూ పిలిచి.. ఓ చెట్టుకు క‌ట్టేసింది. ఆ త‌ర్వాత అత‌నిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దారుణ ఘ‌ట‌న బీహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పుర్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ముజ‌ఫ‌ర్‌పుర్ జిల్లాలోని వాసుదేవ్‌పూర్ స‌రాయ్ గ్రామానికి చెందిన ఓ 25 ఏండ్ల మ‌హిళ త‌న భ‌ర్త‌తో క‌లిసి ఉంటోంది. అయితే గ్రామానికి చెందిన మ‌రో వ్య‌క్తితో ఆమెకు ఏర్ప‌డ్డ ప‌రిచయం వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. భ‌ర్త అడ్డుగా ఉండటంతో అత‌న్ని అంత‌మొందించాల‌ని భార్య నిర్ణ‌యించుకుంది.

ఇక ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం.. సెల్ఫీ తీసుకుందామంటూ.. ఓ చెట్టు ద‌గ్గ‌ర‌కు భ‌ర్త‌ను పిలిచింది. భ‌ర్త‌ను చెట్టుకు క‌ట్టేసి అర‌వ‌కుండా అత‌ని నోట్లో గుడ్డ‌లు కుక్కింది. అనంత‌రం భ‌ర్త‌పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో స్థానికులు అప్ర‌మ‌త్త‌మై.. మంట‌ల‌ను ఆర్పేశారు.

అనంత‌రం బాధిత వ్య‌క్తిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని కేసు న‌మోదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత వ్య‌క్తి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.