Pooja Hegde | వైకుంఠ పాళిలో పూజా హెగ్డే‌! శ్రీలీల జోరుకు తట్టుకోలేక.. సెకండ్ హీరోయిన్‌గా చేయలేక తిప్పలు

Pooja Hegde | హిట్ హీరోయిన్ అనిపించుకుని ఓ రేంజ్‌లో సినిమాలు చేశాక.. ఒక్కసారే గ్రాఫ్ పడిపోయి, ఏదో వైకుంఠ పాళిలో పాము మింగేస్తే నిచ్చెన మీదనుంచి కిందపడ్డట్టు అయిపోయింది బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి. ఎంత గొప్ప వారికైనా డౌన్ ఫాల్ కావడం మామూలే అనుకుని సరి పెట్టేసుకుందామా అంటే అన్నింటికంటే అవమాన భారం వెనకపడి తరుముతుందట. కొత్త నీరు ధాటికి తట్టుకోలేక అదే మన శ్రీలీల జోరుకు తట్టుకోలేక సెకండ్ హీరోయిన్‌గా చేయలేక, సినిమా […]

  • By: krs    latest    Jul 14, 2023 4:05 PM IST
Pooja Hegde | వైకుంఠ పాళిలో పూజా హెగ్డే‌! శ్రీలీల జోరుకు తట్టుకోలేక.. సెకండ్ హీరోయిన్‌గా చేయలేక తిప్పలు

Pooja Hegde |

హిట్ హీరోయిన్ అనిపించుకుని ఓ రేంజ్‌లో సినిమాలు చేశాక.. ఒక్కసారే గ్రాఫ్ పడిపోయి, ఏదో వైకుంఠ పాళిలో పాము మింగేస్తే నిచ్చెన మీదనుంచి కిందపడ్డట్టు అయిపోయింది బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి. ఎంత గొప్ప వారికైనా డౌన్ ఫాల్ కావడం మామూలే అనుకుని సరి పెట్టేసుకుందామా అంటే అన్నింటికంటే అవమాన భారం వెనకపడి తరుముతుందట. కొత్త నీరు ధాటికి తట్టుకోలేక అదే మన శ్రీలీల జోరుకు తట్టుకోలేక సెకండ్ హీరోయిన్‌గా చేయలేక, సినిమా ఛాన్స్‌లు తగ్గి.. ఏం చేయాలో తోచని పరిస్థితులను పూజా ఫేస్ చేస్తోంది.

అసలు విషయం ఏంటంటే.. పూజా హెగ్డే ఇలా కన్నా బుట్టబొమ్మని చెబితే టక్కున గుర్తుకు వస్తుంది కదా. ఈ అమ్మడికి పాపం ఎవరికీ రాని, రాకూడని కష్టం వచ్చి పడింది. స్టార్ హీరోయిన్‌గా అల్లు అర్జున్ సరసన నటించిన ఈ భామ, తమిళంలో ‘బీస్ట్’ మూవీతో విజయ్ సరసన మెరిసిన.. ఇప్పుడు కాలం కలిసి రాక సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటుందట.

‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన పూజా, అటు బాలీవుడ్ దాకా వెళ్ళి హృతిక్ సరసన ‘మోహంజదారో’ సినిమా చేసి చేతులు కాల్చుకుంది. ఆ సినిమా ప్లాప్ అయ్యేసరికి రెండేళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తెలుగు సినిమాల్లోకి వచ్చింది. అప్పుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలో నటించే అవకాశం వచ్చాక.. సినిమా సక్సెస్ విషయం ఎలా ఉన్నా పూజాకు ఆరబోతకు మంచి మార్కులే పడ్డాయి.

ఇక అక్కడి నుంచి అల వైకుంఠపురములో, బీస్ట్ వరకు వరుస అవకాశాలతో దూసుకుపోయింది. బాలీ వుడ్‌లో అవకాశాలు కూడా బాగానే వచ్చాయి కానీ సూపర్ హిట్ ఒకటీ పడక పక్కన పడేశారు. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం, వచ్చిన అవకాశాలను పంతాలకు పోయి వదులు కోవడంతో పూర్తిగా ఖాళీ చేతులతో నిలబడింది పూజా.

ఇక కాలం కలిసి రావట్లేదు కాబట్టి వచ్చిన ఛాన్స్‌లతోనే కాలం నెట్టేద్దాం అనే టైప్ కాదు కాబట్టి, పూలమ్మిన చోటే కట్టెలు అమ్మలేక, అదే సెకండ్ హీరోయిన్ స్థాయికి జారి మరీ నటించలేక అవకాశాలు వచ్చినా తనే తప్పుకుంటుందట పూజా. తాజాగా మహేష్ సరసన హీరోయిన్‌గా చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయింది.

ఆ ఛాన్స్ శ్రీలీల ఖాతాలోకి జమైపోవడంతో మళ్లీ నిచ్చెన మీద నుంచి కిందకు పడినట్టు అయిందట పూజా పని. ఇక సినిమాలకు మొదటిసారి చేసినట్టే కాస్త్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎంట్రీ ఇస్తే బావుంటుంది అనుకుంటుందట ఈ బుట్టబొమ్మ. కాలం ఎప్పుడు ఎవరికి రివర్స్ అవుతుందో ఎవరు చెప్పగలరు. పూజాకు గ్యాప్ ఇవ్వడమే కలిసొస్తుందేమో.. చూడాలి.