HOROSCOPE | చంద్రచారము ఆధారంగా చంద్రచారము 8.27 గంటల వరకు మిథునరాశి, తదుపరి కర్కాటక రాశి. మేష రాశి : చంద్రుడు 8.27 గంటల వరకు 3వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక విషయాల్లో మంచి జరుగుతుంది. గృహ, కుటుంబ రంగాల్లోనూ సానుకూల సంఘటనలు జరుగుతాయి. తదుపరి చంద్రుడు 8.27 గంటల నుంచి 4వ ఇంటకు మారుతున్నందున వృత్తిపరంగా కొన్ని స్వల్ప ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నది. శత్రుత్వాలు కూడా ఏర్పడవచ్చు. […]
HOROSCOPE | చంద్రచారము ఆధారంగా
చంద్రచారము 8.27 గంటల వరకు మిథునరాశి, తదుపరి కర్కాటక రాశి.
మేష రాశి : చంద్రుడు 8.27 గంటల వరకు 3వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక విషయాల్లో మంచి జరుగుతుంది. గృహ, కుటుంబ రంగాల్లోనూ సానుకూల సంఘటనలు జరుగుతాయి. తదుపరి చంద్రుడు 8.27 గంటల నుంచి 4వ ఇంటకు మారుతున్నందున వృత్తిపరంగా కొన్ని స్వల్ప ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నది. శత్రుత్వాలు కూడా ఏర్పడవచ్చు.
వృషభ రాశి : చంద్రుడు 8.27 గంటల వరకు 2వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. ఫలితంగా మానసికంగా వేదన, దిగులు ఉండొచ్చు. కానీ.. తదుపరి చంద్రుడు 8.27 గంటల నుంచి 3వ ఇంటకు (సానుకూలం) మారుతున్నందున ఆర్థిక విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. గృహ, కుటుంబ విషయాల్లోనూ అనుకూల ఘటనలు చోటు చేసుకుంటాయి.
మిథున రాశి : చంద్రుడు 8.27 గంటల వరకు 1వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, వృత్తిపరమైన విషయాల్లో అంతా సానుకూలంగా ఉంటుంది. గృహ విషయాల్లోనూ సానుకూలత ఉంటుంది. తదుపరి చంద్రుడు 8.27 గంటల నుంచి 2వ ఇంటకు (ప్రతికూలం) మారుతున్నందున ఆర్థిక విషయాల్లో స్వల్పంగా నష్టపోతారు. వృత్తిపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. ఫలితంగా మనసు వేదనతో, దిగులుతో ఉంటుంది.
కర్కాటక రాశి : చంద్రుడు 8.27 గంటల వరకు 12వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున ఆర్థిక విషయాల్లో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం కుటుంబ, ప్రాపర్టీ విషయాల్లో కనిపించే అవకాశం ఉన్నది. తదుపరి చంద్రుడు 8.27 గంటల నుంచి 1వ ఇంటకు (సానుకూలం) మారుతున్నందున వృత్తి, వ్యాపార రంగాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది.
సింహ రాశి : చంద్రుడు 8.27 గంటల వరకు 11వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వృత్తి, కుటుంబ విషయాల్లోనూ చెప్పకోతగిన మార్పులు కనిపిస్తాయి. తదుపరి చంద్రుడు 8.27 గంటల నుంచి 12వ ఇంటకు (ప్రతికూలం) మారుతున్నందున వృత్తి, వ్యాపార రంగాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. ఫలితంగా అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.
కన్యా రాశి : చంద్రుడు 8.27 గంటల వరకు 10వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, వృత్తిపరమైన విషయాల్లో చెప్పుకోతగిన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ, ఆరోగ్య విషయాల్లోనూ ప్రగతి కనిపిస్తుంది. తదుపరి చంద్రుడు 8.27 గంటల నుంచి 11వ ఇంటకు (సానుకూలం) మారుతున్నందున ఆర్థిక విషయాల్లో లాభదాయక పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తిపరంగానూ, కుటుంబ పరంగానూ విశేషాలు కనిపిస్తాయి.
తులా రాశి : చంద్రుడు 8.27 గంటల వరకు 9వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని చిన్న చిన్న నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి చంద్రుడు 8.27 గంటల నుంచి 10వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక విషయాల్లో చెప్పుకోతగిన సాఫల్యం కనిపిస్తుంది. గృహ, ఆరోగ్య, కుటుంబ విషయాల్లోనూ దాని ప్రభావం ఉండి.. సానుకూలం విశేషాలు ఉంటాయి.
వృశ్చికరాశి : చంద్రుడు 8.27 గంటల వరకు 8వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. టెన్షన్లు కలుగుతాయి. ఫలితంగా స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నది. తదుపరి చంద్రుడు 8.27 గంటల నుంచి 9వ ఇంటకు (ప్రతికూలం) మారుతున్నందున చిన్న చిన్న నష్టాలు, ఇబ్బందులు, టెన్షన్ల కారణంగా మనసు వేదనతో, విచారంగా ఉండొచ్చు.
ధనూ రాశి: చంద్రుడు 8.27 గంటల వరకు 7వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆరోగ్య విషయాల్లో మెరుగుదల కనిపిస్తుంది. ఆర్థిక, వృత్తిపరమైన విషయాల్లోనూ సత్ఫలితాలను ఆశించవచ్చు. వ్యాపార రంగాల వారికి కూడా లాభిస్తుంది. తదుపరి చంద్రుడు 8వ ఇంటకు (ప్రతికూలం) మారుతున్నందున కొన్ని ఆర్థిక నష్టాలు, కుటుంబ తగాదాల కారణంగా స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నది.
మకర రాశి : చంద్రుడు 8.27 గంటల వరకు 6వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆరోగ్య పరంగా చెప్పుకోతగిన మార్పులు కనిపిస్తాయి. వృత్తి, వ్యాపార రంగాలలో ఉన్నవారికీ సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. తదుపరి చంద్రుడు 8.27 గంటల నుంచి 7వ ఇంటకు మారుతున్నందున ఆరోగ్యంలో మెరుగుదలను ఆశించవచ్చు. వృత్తి, వ్యాపార రంగాల వారికీ లాభిస్తుంది.
కుంభ రాశి : చంద్రుడు 8.27 గంటల వరకు 5వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. దీని వలన మానసికంగా టెన్షన్‌గా ఉంటుంది. తదుపరి చంద్రుడు 8.27 గంటల నుంచి 6వ ఇంటకు (సానుకూలం) మారుతున్నందున గృహ, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో గుణాత్మక విజయాలు సాధిస్తారు.
మీన రాశి : చంద్రుడు 8.27 గంటల వరకు 4వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని స్వల్ప నష్టాలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తున్నది. వీటి కారణంగా వివాదాలు చోటు చేసుకోవడానికి, శత్రుత్వాలు కలగటానికి అవకాశం ఉన్నది. తదుపరి చంద్రుడు 8.27 గంటల నుంచి 5వ ఇంటకు (ప్రతికూలం) మారుతున్నందున స్వల్ప నష్టాలు, ఇబ్బందులతో మానసిక టెన్షన్‌కు గురయ్యే అవకాశం ఉన్నది.