Vemulawada | ప్రసిద్ధ రాజన్న ఆలయంలో దర్గాకు తాళం.. పోలీసు స్టేషన్‌కు పంచాయితీ

నిర్వహణ వివాదాస్పదం ఇరువర్గాల వాగ్వాదం, తోపులాట Vemulawada | విధాత బ్యూరో, కరీంనగర్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని హజ్రత్ సయ్యద్ తాజుద్దీన్ ఖాజా బాగ్ సవార్ దర్గాకు గురువారం తాళం వేశారు. ఈదర్గా నిర్వహణ వివాదాస్పదమైంది. ఈ క్రమంలో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగారు. ఒక దశలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. కొన్నేళ్లుగా పట్టణానికి చెందిన కొన్ని కుటుంబాలు దర్గా నిర్వహణ కొనసాగిస్తున్నాయి. అయితే నిర్వహణ విషయంలో గత […]

  • Publish Date - September 7, 2023 / 10:11 AM IST
  • నిర్వహణ వివాదాస్పదం
  • ఇరువర్గాల వాగ్వాదం, తోపులాట

Vemulawada |

విధాత బ్యూరో, కరీంనగర్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని హజ్రత్ సయ్యద్ తాజుద్దీన్ ఖాజా బాగ్ సవార్ దర్గాకు గురువారం తాళం వేశారు. ఈదర్గా నిర్వహణ వివాదాస్పదమైంది. ఈ క్రమంలో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగారు. ఒక దశలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. కొన్నేళ్లుగా పట్టణానికి చెందిన కొన్ని కుటుంబాలు దర్గా నిర్వహణ కొనసాగిస్తున్నాయి.

అయితే నిర్వహణ విషయంలో గత మహాశివరాత్రి సందర్భంగా వివాదం తలెత్తింది. అప్పట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నతాధికారులు ఇరువర్గాలను సమన్వయపరిచి శాంతింపజేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఒక వర్గం కోర్టు మెట్లు ఎక్కింది.

ఓ వర్గం కోర్టు ఆర్డర్ కాపీని తీసుకొని దర్గా వద్దకు వెళ్లారు. దర్గాలో కూర్చున్న మరో వర్గం వారిని వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేసింది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పట్టణ సీఐ కరుణాకర్ దర్గా వద్దకు చేరుకున్నారు.

ఇరువర్గాలతో చర్చించారు. వివాదం కోర్టులో ఉన్న కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, రాజన్న ఆలయానికి విచ్చేసిన భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా తాత్కాలికంగా దర్గాకు తాళం వేశారు. కోర్టు ఆర్డర్ వచ్చేవరకు ఎవరూ దర్గాను నిర్వహించరాదని సీఐ తేల్చి చెప్పారు.