విధాత, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కు ఆదివారం భక్తులు పోటెత్తారు.
కార్తిక మాసం.. చివరి ఆదివారం.. సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. కార్తీకదీప ఆరాధన సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు.