యాదాద్రికి పోటెత్తిన భ‌క్తులు

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి తరలివచ్చారు. శివ కేశ‌వుల‌కు ప్రీతిక‌ర‌మైన కార్తిక‌మాసం కావ‌డంతో భ‌క్తులు యాదాద్రి ఆల‌య ప‌రిస‌రాల్లో కార్తీక దీపాలు వెలిగించి స్వామి ద‌ర్శ‌నం చేసుకొని భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగిపోయారు. అలాగే గుట్ట‌పై నిర్వ‌హించిన‌ స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాలు, ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొని త‌రించారు.

  • Publish Date - November 13, 2022 / 11:16 AM IST

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి తరలివచ్చారు.

శివ కేశ‌వుల‌కు ప్రీతిక‌ర‌మైన కార్తిక‌మాసం కావ‌డంతో భ‌క్తులు యాదాద్రి ఆల‌య ప‌రిస‌రాల్లో కార్తీక దీపాలు వెలిగించి స్వామి ద‌ర్శ‌నం చేసుకొని భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగిపోయారు. అలాగే గుట్ట‌పై నిర్వ‌హించిన‌ స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాలు, ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొని త‌రించారు.