Dharmana Prasada Rao | ధర్మాన బ్యాలెన్స్ తప్పుతున్నరు

Dharmana Prasada Rao విధాత‌: సీనియర్ మంత్రి, వైయస్సార్ హయాంలో సైతం ప్రధాన శాఖలు చూసి ముప్పయ్యేళ్లుగా రాజకీయాలు చూసిన మనిషి ఇప్పుడేమి ఇలా బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరిట ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా గతంలో ఆయన మాట్లాడుతూ వలంటీర్లు వైసీపీ కోసం కష్టపడాలని.. లేకపోతే వారిని తొలగిస్తామని హెచ్చరించారు. ఇక తాజాగానూ ఆయన గడప గడపకు […]

  • Publish Date - June 29, 2023 / 03:38 PM IST

Dharmana Prasada Rao

విధాత‌: సీనియర్ మంత్రి, వైయస్సార్ హయాంలో సైతం ప్రధాన శాఖలు చూసి ముప్పయ్యేళ్లుగా రాజకీయాలు చూసిన మనిషి ఇప్పుడేమి ఇలా బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరిట ప్రజల వద్దకు వెళ్తున్నారు.

ఈ సందర్భంగా గతంలో ఆయన మాట్లాడుతూ వలంటీర్లు వైసీపీ కోసం కష్టపడాలని.. లేకపోతే వారిని తొలగిస్తామని హెచ్చరించారు. ఇక తాజాగానూ ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. కొందరు జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ టీడీపీకి ఓటు వేస్తున్నారని నిష్టూరమాడారు.

పేదల కోసం జగనన్న చేస్తున్న సేవలు గుర్తించకపోతే మీకే నష్టం అని చెబుతూ జగన్ ను మళ్ళీ గెలిపించే బాధ్యత మేదేనని ప్రజలకు గుర్తు చేశారు. తంగివానిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొన్నారు.

గత నాలుగు ఎన్నికల్లో ఎప్పుడూ పెద్దపాడు తంగివానిపేట వానవానిపేట శాస్త్రులపేటల్లో.. తనకు మెజార్టీ రాలేదని ప్రజలకు గుర్తు చేస్తూ అక్కడ అభివృద్ధి పనులు చేయండని అడిగే హక్కు ప్రజలకు లేదని తేల్చేశారు.

తనకు ఓటు వేయనప్పటికీ ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాను అన్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలో మహిళలు తమ భర్తలను ప్రశ్నించాలని కోరారు. మొత్తానికి ప్రజల మీద ధర్మాన వ్యక్తం చేస్తున్నది కోపమా ? ధర్మాగ్రహమా అనేది తెలియడం లే…