Election Campaign | ఎన్నిక‌ల ప్ర‌చారంలో పిల్లల‌ను వాడొద్దు

త్వ‌ర‌లో లోక్‌స‌భ ఎన్నిక‌లు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం కీల‌క ఆదేశాలు జారీచేసింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో పిల్ల‌ల‌ను ఉప‌యోగించవ‌ద్ద‌ని సూచించింది

Election Campaign | ఎన్నిక‌ల ప్ర‌చారంలో పిల్లల‌ను వాడొద్దు
  • పోస్ట‌ర్లు, క‌ర‌ప‌త్రాల పంపిణీ, ఇత‌ర ఏ రూపంలో
  • కూడా చిన్నారులను ఉప‌యోగించ‌వ‌ద్దు
  • రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నిక‌ల సంఘం సూచ‌న‌


Election Campaign | విధాత‌: త్వ‌ర‌లో లోక్‌స‌భ ఎన్నిక‌లు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో భార‌త ఎన్నిక‌ల సంఘం కీల‌క ఆదేశాలు జారీచేసింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో పిల్ల‌ల‌ను ఉప‌యోగించ వ‌ద్ద‌ని సూచించింది. పోస్టర్లు, కరపత్రాల పంపిణీ లేదా నినాదాలతో సహా “ఏ రూపంలోనైనా” పిల్లలను ప్రచారంలో ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం సోమవారం రాజకీయ పార్టీలను కోరింది. పార్టీలకు పంపిన సలహాలు, సూచ‌న‌ల్లో ఈ విష‌యాన్ని స్ప‌ష్టంగా పేర్కొన్న‌ది. పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియలో పిల్లలను ఏ విధంగానైనా ఉప‌యోగించిట్ట‌యితే ఉపేక్షించ‌బోమ‌ని హెచ్చ‌రించింది.


రాజకీయ నాయకులు, అభ్యర్థులు తమ చేతుల్లోకి పిల్ల‌ల‌ను తీసుకోవ‌డం, ప్ర‌చారంలో పిల్ల‌ల‌ను ఎత్తుకోవ‌డం, ముద్దుచేయ‌డం, వాహనంలో లేదా ర్యాలీల్లో పిల్లలను తీసుకెళ్లడం వంటి ఏ పద్ధతిలోనైనా ప్రచార కార్యక్రమాలకు పిల్లలను ఉపయోగించకూడదని ఈసీ సూచించింది. “పద్యం, పాటలు, మాట్లాడే పదాలు, రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి చిహ్నాల ప్రదర్శనతో సహా ఏ పద్ధతిలోనైనా రాజకీయ ప్రచారానికి పిల్లలను ఉపయోగించ‌డ నిషేధం” అని ఈసీ సోమ‌వారం ఒక ప్రకటనలో తెలిపింది.


రాజకీయ పార్టీ ఎలాంటి ఎన్నికల ప్రచార కార్యకలాపాల్లో పాల్గొనని రాజకీయ నాయకుడికి సమీపంలో వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుడితో కలిసి ఉండటం మార్గదర్శకాల ఉల్లంఘనగా పరిగణించబడదని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో పార్టీలు భాగస్వాములు కావాలని కోరారు.