వీరయ్య చూడొద్దు.. వీరసింహారెడ్డి చూడు: రామ్ చరణ్‌తో బాలయ్య

బాలయ్య మాట‌కారిత‌నానికి ఎవరైనా పడిపోవాల్సిందే! విధాత: బాలయ్య సామాన్యంగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు, సినిమా వేడుకల్లో మాట్లాడేటప్పుడు ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా ఏవేవో మాట్లాడతాడనే విమర్శ ఉంది. కానీ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె మొద‌లైన‌ తరువాత బాలయ్యలోని అసలుసిస‌లు మాటకారి బయటకు వచ్చాడు. ఆయన అతిధులను అడుగుతున్న ప్రశ్నలు… వారిని ఇరుకున పెడుతున్న విధానం.. తమాషాగా ఉన్నాయి. అతిథుల‌తో ఆయ‌న స‌మ‌యోచితంగా చేస్తోన్న పరాచకాలు… వారిని ఆటపట్టించడం వంటివి చూస్తే ఎవరికైనా బాలయ్య ఇంత […]

  • By: krs    latest    Dec 30, 2022 6:45 AM IST
వీరయ్య చూడొద్దు.. వీరసింహారెడ్డి చూడు: రామ్ చరణ్‌తో బాలయ్య

బాలయ్య మాట‌కారిత‌నానికి ఎవరైనా పడిపోవాల్సిందే!

విధాత: బాలయ్య సామాన్యంగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు, సినిమా వేడుకల్లో మాట్లాడేటప్పుడు ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా ఏవేవో మాట్లాడతాడనే విమర్శ ఉంది. కానీ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె మొద‌లైన‌ తరువాత బాలయ్యలోని అసలుసిస‌లు మాటకారి బయటకు వచ్చాడు. ఆయన అతిధులను అడుగుతున్న ప్రశ్నలు… వారిని ఇరుకున పెడుతున్న విధానం.. తమాషాగా ఉన్నాయి. అతిథుల‌తో ఆయ‌న స‌మ‌యోచితంగా చేస్తోన్న పరాచకాలు… వారిని ఆటపట్టించడం వంటివి చూస్తే ఎవరికైనా బాలయ్య ఇంత మంచి మాటకారా అనిపించక మానదు.

ఇక విషయానికొస్తే ప్రేక్షకులను చాలా కాలం నుండి ఊరిస్తూ వచ్చిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె ప్రభాస్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎదురుచూపులకు తగ్గట్టుగానే ఆహా మీడియా వారు ప్రభాస్ ఫ్యాన్స్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇది మొద‌ట కేవలం ఒక ఎపిసోడ్ మాత్రమే అని ప్రచారంలోకి వచ్చింది. కానీ అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచేందుకు ఆహా మీడియా రెండు పార్ట్‌లుగా ఈ ఎపిసోడ్‌ను విభ‌జించారు. ఈ రెండు పార్ట్స్ మొత్తం ఫుల్ ఫ‌తో నిండిపోయాయని అంటున్నారు.

ఇక మొదటి పార్ట్‌కు సంబంధించిన రెండో ప్రోమోని కూడా విడుదల చేశారు. ఇందులో ముందుగా బాలయ్య ప్ర‌భాస్‌తో మాట్లాడుతూ అందర్నీ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తావు… నీ పిలుపుకే అందరూ పడిపోతారు.. వారిలో నేను కూడా ఉన్నాను… అంటాడు. ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్, రామ్ చరణ్‌కి ఫోన్ చేస్తాడు అనే విషయం మొదటినుంచి మనకు అర్థమైంది. రెండో ప్రోమోలో కూడా రామ్ చరణ్‌తో ఫోన్ కాల్‌కి సంబంధించి ఒక చిన్న బిట్టు ఉంది.