ఆరేండ్ల ముస్తఫాను కాపాడిన ‘డోరెమాన్‌’!

విధాత: కార్టూన్‌ షో ‘డోరెమాన్‌’ ఆరేండ్ల పిల్లాడి ప్రాణాలు కాపాడింది. కార్టూన్‌ షోలో హీరో ఎలాగైతే భూ కంపం బారినుంచి తప్పించుకుంటాడో.. అలా తానూ చేసి ముస్తఫా అనే పిల్లాడు ప్రాణాలు నిలుపుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌ భదోహీ జిల్లాలో జరిగింది. యూపీ భదోహీ జిల్లాలో సంభవించిన పేలుడు ఘటనలో మూడు ఇండ్లు కుప్పకూలి 11మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా కూలిన ఇంటి శిథిలాల కింద నలిగి చనిపోయారు. కాగా ఓ ఇంట్లో ఉన్న ఇద్దరు చనిపోగా […]

  • By: krs    latest    Jan 27, 2023 7:49 AM IST
ఆరేండ్ల ముస్తఫాను కాపాడిన ‘డోరెమాన్‌’!

విధాత: కార్టూన్‌ షో ‘డోరెమాన్‌’ ఆరేండ్ల పిల్లాడి ప్రాణాలు కాపాడింది. కార్టూన్‌ షోలో హీరో ఎలాగైతే భూ కంపం బారినుంచి తప్పించుకుంటాడో.. అలా తానూ చేసి ముస్తఫా అనే పిల్లాడు ప్రాణాలు నిలుపుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌ భదోహీ జిల్లాలో జరిగింది.

యూపీ భదోహీ జిల్లాలో సంభవించిన పేలుడు ఘటనలో మూడు ఇండ్లు కుప్పకూలి 11మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా కూలిన ఇంటి శిథిలాల కింద నలిగి చనిపోయారు. కాగా ఓ ఇంట్లో ఉన్న ఇద్దరు చనిపోగా ఓ ఆరేండ్ల బాలుడు మాత్రం చావునుంచి చిరంజీవిగా బయటపడ్డాడు. దీంతో ఆశ్చర్యానికి గురైన ఇరుగు పొరుగు ఎలా బతక గలిగావని అడిగితే… విస్తుపోయే విషయాలు చెప్పాడు.

ముస్తఫా చెప్పిన దాని ప్రకారం… ముస్తఫా, తన తల్లి, నానమ్మతో ఇంట్లో ఉండగా చెవులు చిల్లులు పడేలా పెద్ధ శబ్ధం వినిపించింది. గోడలు బీటలు బారి ఇల్లు నేలకూలుతున్న దృశ్యం.. అంతే… ఆరేండ్ల ముస్తఫాకు ‘డోరెమాన్‌’ కార్టూన్‌ షోలో హీరో నోబిత చేసిన కృత్యం కండ్లముందు కదలాడింది. వెంటనే ఓ బెడ్‌తో ఉన్న మంచం కిందికి దూరాడు. ప్రాణాలు నిలుపుకొన్నాడు.

అలా మంచం కిందికి దూరి ప్రాణాలు దక్కించుకోవటానికి తాను టీవీలో చూసిన కార్టూన్‌ షో డోరేమాన్‌ కారణమని చెప్పుకొచ్చాడు. ఆ షోలో హీరో భూ కంపం భారినుంచి తప్పించుకోవటం కోసం ఒక దాని కిందకు దూరి తనను తాను రక్షించుకొంటాడు. ఇదే దుర్ఘటనలో ముస్తఫా తల్లి ఉజ్మా, నానమ్మ బేగం హైదర్‌ చనిపోయారు.

ఈ ఘటన జరిగిన రోజు ఇంట్లో ముస్తఫా తండ్రి అబ్బాస్‌, తాత ఇంట్లో లేరు. ఇంట్లో ఉంటే వారి పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. అంతకు ముందు రోజే ముస్తఫా తాత, నానమ్మ వివాహ గోల్డెన్‌ జుబ్లీ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. తెల్లారే ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ఇల్లు కూలిన ఘటనతో తీవ్రంగా భయకంపితుడైన ముస్తఫాను హాస్పిటల్‌ చేర్చి చికిత్స అందిస్తున్నారు. ముస్తఫాకు అతని నానమ్మ బేగం హైదర్‌ చనిపోయిన విషయం ఇంకా చెప్పలేదు.