Earthquake: మయన్మార్, థాయిలాండ్‌లలో పెరుగుతున్న భూకంప మృతులు!

మయన్మార్‌, థాయిలాండ్ దేశాల్లో భారీ భూకంపాలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. నిమిషాల వ్యవధిలో వరుసగా మూడుసార్లు సంభవించిన భూకంపాల తీవ్రత ధాటికి అనేక భవనాలు కూలిపోగా..భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్న కథనాలు కలవర పెడుతున్నాయి.

Earthquake: మయన్మార్, థాయిలాండ్‌లలో పెరుగుతున్న భూకంప మృతులు!

Big Earthquakes: మయన్మార్‌, థాయిలాండ్ దేశాల్లో భారీ భూకంపాలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. నిమిషాల వ్యవధిలో వరుసగా మూడుసార్లు సంభవించిన భూకంపాల తీవ్రత ధాటికి అనేక భవనాలు కూలిపోగా..భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్న కథనాలు కలవర పెడుతున్నాయి. ప్రస్తుత సమాచారం మేరకు భూకంప మృతుల సంఖ్య 107మంది కాగా, వందలాది మందికి తీవ్రగాయాలైనట్లుగా మయన్మార్ అధికారులు ప్రకటించారు. రాజధాని నేపిడాలో  వేయి పడకల ఆసుపత్రి భవనం కూలిన ఘటనలో  మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.   అటు ధాయిలాండ్ లో భూకంపంతో కూలిన భవనాల మధ్య 93మంది గల్లంతైనట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రెండు దేశాల్లో   మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కూలిన భవనాల శిధిలాల కింద వేల మంది ఉన్నట్టుగా సమాచారం.


మయన్మార్‌ను వణికించిన మూడు వరుస భూకంపాలు.. 7.7… 6.4… 4.9 తీవ్రతను నమోదు చేశాయి. భూ ప్రకంపనల ధాటికి..చారిత్రక కట్టడాలు..భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రజలు రోడ్లపైనే భయంభయంగా గడుపుతున్నారు.  మ్యాండలేలో ఉన్న ఐకానిక్ ఆవా వంతెన ఇరావడీ నదిలో కూలిపోయింది.  ఈ నగరంలో వేలాది ఇళ్లు శిధిల గుట్టలను తలపించాయి.  మయన్మార్ లో సంగైన్ 16 కిలోమీటర్ల దూరంలో భూమి లోపల పది కిలోమీటర్ల వద్ద భూకంప కేంద్రం కేంద్రం గుర్తించారు.

అటు థాయిలాండ్ బ్యాంకాక్ సహా పరిసర నగరాల్లో భారీ భూకంపం సంభవించింది. పలు బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. బ్యాంకాక్ లో నిర్మాణంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో 43 మంది కార్మికులు చిక్కుకున్నారు. రిక్టర్ స్కేల్ పై 7.3గా భూకంప తీవ్రత నమోదైంది.  థాయిలాండ్ ప్రధాని దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. థాయ్‌లాండ్‌ ఎయిర్‌పోర్టు లాక్‌డౌన్ ప్రకటించి అన్ని విమాన సర్వీసులు రద్దు చేశారు. థాయ్‌లాండ్‌కు వచ్చే విమానాలు దారి మళ్లించారు. బ్యాంకాక్‌లో రైల్వే, మెట్రో సేవలు నిలిపివేశారు. ఇప్పటిదాకా 93గల్లంతైనట్లుగా ప్రభుత్వం తెలిపింది.

 

భారత్, చైనా.. బంగ్లాదేశ్ లోనూ భూప్రకంపనలు

భారత్, బంగ్లాదేశ్, చైనా, వియత్నాంలోనూ  భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భారత్ లో కోల్ కత్తా, మేఘాలయ, మణిపూర్లలోను భూమి కంపించింది. చైనా సరిహద్దు ప్రావిన్స్ లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

సహాయానికి మేం సిద్ధం: ప్రధాని మోదీ

థాయిలాండ్, మయన్మార్ భూకంపంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సాధ్యమైన సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. సహాయక చర్యల కోసం మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని విదేశాంగ శాఖను ఆదేశించారు.