Major Earthquakes: మయన్మార్..బ్యాంకాక్ లో భారీ భూకంపాలు!

మయన్మార్, బ్యాంకాక్ లను భారీ భూకంపాలు వణికించాయి. భూకంప ప్రకంపనల తీవ్రత ధాటికి పెద్ధ ఎత్తున భవనాలు కూలిపోయి ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

  • By: Somu |    latest |    Published on : Mar 28, 2025 1:06 PM IST
Major Earthquakes: మయన్మార్..బ్యాంకాక్ లో భారీ భూకంపాలు!

Major Earthquakes: మయన్మార్, బ్యాంకాక్ లను భారీ భూకంపాలు వణికించాయి. భూకంప ప్రకంపనల తీవ్రత ధాటికి పెద్ధ ఎత్తున భవనాలు కూలిపోయి ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్ జీ) నివేదిక మేరకు మయన్మార్‌లో లో భూకంపం తీవ్రత 7.7గా నమోదైంది. భూకంప తీవ్రతకు మయన్మార్ లోని మండలేలో ఉన్న ఐకానిక్ ఆవా వంతెన ఇరావడీ నదిలో కూలిపోయింది. వంతెన కూలిన దృశ్యాలు వైరల్ గా మారాయి. బర్మాసిటీలోని భారీ భవనాలు ఊగిసలాడాయి.

 

శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వచ్చిన ఈ భూకంప ప్రకంపనలు 5 నిమిషాలకుపైగా కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు. రెండు సార్లు భూకంపాలు ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకోవడంతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ధాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో భూపం తీవ్రత 7.3గా నమోదైంది. భూకంప కేంద్రం సాగింగ్ సమీపంలో ఉన్నట్లుగా యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

భారత్ లోను భూకంపం
భారత్ లోని మేఘాలయా, కోల్ కతా, ఇంఫాల్, ఢిల్లీ నగరాల్లో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి. మేఘాలయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కెల్ పై 4గా నమోదైంది.