Earthquake | ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో సోమవారం అర్ధరాతి భారీ భూంకంపం సంభవించింది. ఒక్కసారిగా భారీ ప్రకంపనలు రావడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంప కేంద్రం గుర్తించామని, రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రత నమోదైందని నేషనల్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. దక్షిణ చైనాలని జిన్‌జియాంగ్‌లో భూమికి 80 కిలోమీటర్ల లోతుటులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది.
చైనాలోని పశ్చిమ జిన్‌జియాంగ్ ప్రాంతంలోని 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. అక్సు ప్రావిన్స్‌లోని వుషు కౌంటీలో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల తర్వాత భూకంపం సంభవించిందని పేర్కొంది. భారీ భూకంపం తర్వాత పలుసార్లు మళ్లీ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై వాటి తీవ్రత 4.5గా నమోదైంది. కిర్గిజిస్తాన్-జిన్‌జియాంగ్ సరిహద్దులో ఇండ్లు కూలిపోయాయని సమచారం.
భూకంపం సంభవించిన వెంటనే జిన్‌జియాంగ్ రైల్వేశాఖ 27 రైళ్లను నిలిపివేసింది. తియాన్ షాన్ పర్వత శ్రేణిలో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. గత శతాబ్దంలో ఈ ప్రాంతంలో సంభవించిన అతిపెద్ద భూకంపమని, 1978లో మంగళవారం తెల్లవారుజామున ఉత్తరాన 200 కిలోమీటర్ల దూరంలో 7.1 తీవ్రతతో సంభవించింది. ఈ భారీ కుదుపులకు పొరుగు దేశాలైన కిర్గిజ్‌స్తాన్, కజకిస్తాన్‌లో ప్రకంపనలు రికార్డయ్యాయి.
భూకంపాలు ఎందుకు వస్తాయ్..?
భూమి లోపల 7 ప్లేట్లు ఉంటాయి. అవి నిరంతరం కదులుతుంటాయి. కొన్ని సార్లు ఢీకొట్టుకుంటాయి. ఈ ప్లేట్లు ఢీకొనే జోన్‌ను ఫాల్ట్ లైన్ అంటారు. తరుచూ పలకలు ఢీకొట్టుకోవడం వల్ల ప్లేట్ల మూలలు వంపుగా ఉంటాయి. దాంతో ఒత్తిడి పెరిగినప్పుడు ఆ ప్లేట్లు విరిగిపోతాయి. ఆ సమయంలో విరిగిపోయే సమయంలో శక్తి ఏర్పడుతుంది. అది బయటకు వెళ్లేందుకు మార్గాన్ని కనుగొంటుంది. ఆ సమయంలోనే భూకంపం సంభవిస్తుంది.
భూకంపాలను రిక్టర్ స్కేల్ ఉపయోగించి కొలుస్తారు. దీన్నే రిక్టర్ మాగ్నిట్యూడ్ టెస్ట్ స్కేల్ అంటారు. భూకంపాలను రిక్టర్ స్కేల్‌లో ఒకటి నుంచి 9 తీవ్రత వరకు కొలుస్తారు. భూకంపాన్ని దాని కేంద్రం నుంచి కొలుస్తారు. భూకంపం సమయంలో భూమి లోపల నుంచి విడుదలయ్యే శక్తి తీవ్రత ద్వారా అంచనా వేస్తారు. ఈ తీవ్రత భూకంపం తీవ్రతను నిర్ణయిస్తుంది.