ఇండోనేషియాలో భూకంపం.. 44 మంది మృతి

విధాత: ఇండోనేషియాలోని జావా ద్వీపంలో భూకంపం సంభవించింది. 49 సెకన్ల పాటు మూమి కంపించగా.. భూకంపం ధాటికి 44 మంది మృతి చెందగా.. మరో 300 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. BREAKING: #BNNIndonesia Reports The death toll from an earlier earthquake in #Indonesia's West Java has risen to 44, with hundreds more injured, according to government sources.pic.twitter.com/23LXIAgGwI — […]

  • Publish Date - November 21, 2022 / 09:44 AM IST

విధాత: ఇండోనేషియాలోని జావా ద్వీపంలో భూకంపం సంభవించింది. 49 సెకన్ల పాటు మూమి కంపించగా.. భూకంపం ధాటికి 44 మంది మృతి చెందగా.. మరో 300 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.6 శాతం నమోదైంది. క్షతగాత్రులను దగ్గరిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భూకంపం వల్ల పలుచోట్ల ఇళ్లు, భవనాలు కూలిపోయాయి.

పశ్చిమ జావా ప్రావిన్స్‌ సియాంజూర్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గ్రేట్‌ జకర్తా ప్రాంతంలో అధిక భూకంపం తీవ్రత కనిపించింది. ఇస్లామిక్‌ బోర్డింగ్‌ స్కూల్‌, ఆస్పత్రి సహా అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. ఎత్తైన భవనాల నుంచి ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు.