అంతా ఉల్టా పుల్టా… హౌజ్‌లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్.. అది ఎవరంటే..!

బిగ్ బాస్ సీజన్ 6 ప్రేక్షకులని పెద్దగా అలరించకపోవడంతో సీజన్ 7ని సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు. అంతా ఉల్టా పుల్టా అంటూ ఎవరు ఊహించని విధంగా షాక్‌ల మీద షాకులు ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హౌజ్‌లోకి కొద్ది మంది కంటెస్టెంట్స్‌ని పంపి షాకిచ్చిన బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లో మూడు వారాలు ఉండి ఎలిమినేట్ అయిన ఒక కంటెస్టెంట్‌ని హౌజ్‌లోకి ప్రవేశ పెట్టబోతున్నారు.
శనివారం ఎపిసోడ్‌లో ముందుగా శుక్రవారం ఏం జరిగిందో చూపించారు నాగార్జున. ఆ తర్వాత హౌజ్‌మేట్స్ తప్పొప్పుల గురించి మాట్లాడారు. కొత్తగా ఎన్నికైన యావర్ యాటిట్యూడ్ చూపిస్తున్నారని కొందరు భావిస్తుండగా వారికి రూల్స్ తెలియజేశాడు.
కెప్టెన్ అనే వాడు డిక్టేటర్‌లా ఉండొద్దని, అందరి మనసులు గెలుచుకోవాలంటూ యావర్‌కి చెప్పాడు. ఇక అమర్ దీప్ గేమ్ డెవలప్ అయిందని, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు నాగ్. అనంతరం హౌజ్‌లో బ్రెయిన్ లెస్, ఎయిమ్ లెస్, యూజ్‌లెస్ ట్యాగ్‌లు ఎవరికి సరిపోతాయో చెప్పాలంటూ చిన్న గేమ్ ఆడించాడు నాగార్జున.
ఈ ఆటలో భోలేకి మూడు ఎయిమ్ లెస్, ఒక బ్రెయిన్ లెస్ ట్యాగ్ రాగా, ఆయన తర్వాత అశ్విని, అమర్ దీప్‌లకు బ్రెయిన్ లెస్ ట్యాగ్‌లు పడ్డాయి. ఇలా అమర్ దీప్, అశ్విని బ్రెయిన్ లెస్‌గా, భోలే ఎయిమ్ లెస్‌గా నిలిచారు. వీటి నుండి బయటపడాలని, గేమ్‌పై ఇంకాస్త ఫోకస్ పెట్టాలని సూచించారు నాగార్జున.
ఇక బిగ్ బాస్ 7 అంతా ఉల్టా పుల్లా. మీకు మరో సర్‌ప్రైజ్ రాబోతుంది అంటూ రతిక, దామిని, శోభలని మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చారు. వారేంటో మళ్లీ నిరూపించుకునే సెకండ్ ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఈ ముగ్గురు హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ముందు నిలుచొని ఓట్ అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటెస్టెంట్లని మనసుని దోచుకుని తమకి ఎక్కువగా ఓట్లు పడేలా ప్రచారం చేసుకోవాలని నాగార్జున చెబుతారు.
ముందుగా దామిని మాట్లాడుతూ..యావర్‌పై పేడ కొట్టడం టాస్క్ వల్లనే బయటకు వచ్చేసానని, ఈ సారి తానేంటో నిరూపించుకుంటానని పేర్కొంది. మీ మ్యూజిక్ సిస్టమ్ అవుతానంటూ తెలియజేసింది. ఇక రతిక మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, నిజాయితీగా గేమ్ ఆడతానని, ఫిజికల్‌గా, మెంటల్‌గా తాను స్ట్రాంగ్ అని నిరూపించుకుంటానని పేర్కొంది.
ఇక ఫైనల్ గా శుభ శ్రీ మాట్లాడుతూ.. థ్రిల్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్ని అందిస్తానని, ప్రతి విషయంలో బెస్ట్ ఇచ్చానని, కానీ అనుకోకుండా ఎలిమినేట్ అయ్యానంటూ పేర్కొన్న ఈ అమ్మడు ఇదొక్కసారి తనకి అవకాశం ఇవ్వాలంటూ చెప్పుకొచ్చింది. మరి వీరిలో ఎరు హౌజ్‌లోకి వెళతారో నేడు తెలియనుంది.