విధాత: సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రైవేటీకరణ అంశం తెలంగాణ అసెంబ్లీలో మున్సిపల్ మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. సింగరేణి కాలరీస్‌ను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
సింగరేణికి బ్లాకులు కేటాయిస్తే, వద్దంటూ తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసిందని, ఆ లేఖ తన వద్ద ఉందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాక ముందు ఒక లక్షా ఇరవై వేలతో కళకళలాడిన సింగరేణి కాలరీస్, పది లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నది. తెలంగాణ వచ్చిన రోజు 50 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ప్రస్తుతం 65 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగినా, సిబ్బంది మాత్రం 47 వేలకు తగ్గిపోయారు.
నా సింగరేణి తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా మైనింగ్ చేస్తుందని, అవసరమైతే ఆస్ట్రేలియాలో కూడా బొగ్గు గనులను తీసుకుని సింగరేణికి అప్పగిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఒడిశాలో మైనింగ్ వచ్చింది, మరో ప్రాంతంలో కూడా కేటాయించారు. 2022లో కొన్ని మైనింగ్స్ ను కేంద్రం కేటాయించగా, వద్దని రాష్ట్ర ప్రభుత్వం వద్దని చెప్పిందన్నారు.
https://www.youtube.com/live/n6xQh0KYDCY?feature=share
కేంద్రం కేటాయించిన గనులను ప్రైవేటు పరం చేయవద్దని, వాటిని సింగరేణికే కేటాయించాలని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. కేంద్రం నుంచి బొగ్గు గనులు రాష్ట్రాలు తీసుకోవాలంటే, లాభాల్లో 14 శాతం వాటాలు చెల్లించాల్సి ఉంటుందని, అందుకే గుజరాత్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌కు నామినేషన్ పై గనులు ఇచ్చారన్నారు. టెండర్‌లో పాల్గొని దక్కించుకుంటే లాభాల్లో 4 శాతం రాష్ట్రాలు చెల్లించాల్సి ఉంటుందని రాజేందర్ వివరించారు.
కేంద్రం బొగ్గు గనుల విషయంలో ఏం చేస్తున్నది, ప్రైవేటు వ్యక్తుల విషయంలో ఏం చేస్తున్నది, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విషయంలో ఏం చేస్తున్నదో కేంద్రం తన వైఖరి స్సష్టం చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి KTR స్పందించారు. దేశీయ బొగ్గు కొనుగోలు చేయవద్దని, విదేశాల నుంచి దిగుమతి అయ్యే బొగ్గు కచ్చితంగా కొనుగోలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసిందని ఆయన తెలిపారు. ఎవరి ప్రయోజనం కోసం ఈ లేఖలు రాశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Live: Minister @KTRBRS speaking in Legislative assembly https://t.co/LBj4UF5x04
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 10, 2023
ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించిన రెండు నెలల్లోనే ఆయన దోస్తు (గౌతమ్ అదాని)కి బొగ్గు గనులు కేటాయిస్తారన్నారు. ఇండోనేషియా వెళ్తారు, ఒకటే నెలలో గనులు కేటాయిస్తారు. మేము పారిశ్రామిక విధానానికి అనుకూలంగా ఉంటాము కాని, ఒకే ఒక పరిశ్రమ యజమాన్ని లక్షల కోట్లకు అధిపతిని చేసేందుకు మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. దోస్తుల కోసం పనిచేసే ప్రభుత్వం తెలంగాణలో లేదని అన్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తుక్కు కింద అమ్ముతున్నది ఎవరు, కేంద్రం కాదా, ఏ కారణంతో అమ్ముతున్నారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించకుండా, నష్టాల పేరుతో తెగ నమ్ముతారన్నారు. అదే వ్యూహాన్ని సింగరేణి కాలరీస్ విషయంలో నరేంద్ర మోదీ వ్యవహరిస్తారని దెప్పి పొడిచారు. గుజరాత్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు నామినేషన్ పై గనులు ఇస్తారు, సింగరేణికి ఎందుకు ఇవ్వరని అడిగారు. సింగరేణిపై మీ పార్టీ విధానం ఏంటో చెప్పాలన్నారు.
Live: Minister @KTRBRS speaking in Legislative assembly https://t.co/FPz6ySYcRR
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 10, 2023