రెండు చోట్ల ఓట‌మి దిశ‌గా ఈట‌ల రాజేంద‌ర్‌

బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డి లా త‌యారైంది. బీజేపీ నాయ‌కుడు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఈట‌ల రాజేంద‌ర్‌ను సీఎంను చేస్తామ‌న్న ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు.

రెండు చోట్ల ఓట‌మి దిశ‌గా ఈట‌ల రాజేంద‌ర్‌
  • రెంటికి చెడ్డ ఈట‌ల‌
  • ఈట‌ల క‌థ ఆఖ‌రికి ఇలా


విధాత‌: బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డి లా త‌యారైంది. బీజేపీ నాయ‌కుడు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఈట‌ల రాజేంద‌ర్‌ను సీఎంను చేస్తామ‌న్న ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. పైగా స్వంత నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలి వెళ్లాడ‌న్న అక్రోశం కూడా హుజూరాబాద్ ప్ర‌జ‌ల్లో క‌నిపించింది. మ‌రో వైపు రాష్ట్రంల జ‌రుగుత‌న్న రాజ‌కీయ ప‌రిణామాలు, ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోవ‌డంతో ఈట‌ల విఫ‌ల‌మ‌య్యారా? అన్న చ‌ర్చ కూడా రాజ‌కీయ పరిశీల‌కుల్లో జ‌రుగుతోంది. బీఆరెస్ నుంచి సీఎం కేసీఆర్ బ‌య‌ట‌కు పంపించిన‌ప్పుడు బీజేపీలోకి వెళ్ల‌డాన్ని ప్ర‌జ‌లు స్వీక‌రించారు.


దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో సీఎం కేసీఆర్ దాదాపు రూ. 2 వేల కోట్ల ఖ‌ర్చు చేసినా ప‌ట్టించుకోలేదు. ఈట‌ల‌నే ఆద‌రించి మంచి మెజార్టీ ఇచ్చారు. ఆత‌రువాత మారిన రాజ‌కీయ ప‌రిణామాలు ప‌రిశీలిస్తే బీజేపీతో బీఆరెప్ అవ‌గాహ‌న‌కు వ‌చ్చిందన్నఅభిప్రాయం ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లింది. తెలంగాణ‌లో కేసీఆర్ ప‌ట్ల వ్య‌తిరేక‌త చూపిన ప్ర‌జ‌లు బీజేపీని తిర‌స్క‌రించారు. కేసీఆర్‌కు ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్‌నే భావించారు. ఫ‌లితంగా అప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌నుమ‌రుగైంద‌నుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క‌సారిగా పెరిగింది.


ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న మార్పును గ‌మ‌నించిన కాంగ్రెస్ పార్టీ జాగ్ర‌త్త‌గా అడుగులేసి త‌న బ‌లాన్ని పెంచుకున్న‌ది. అప్ప‌టి వ‌ర‌కు బీజేపీలోకి వెళ్లాలా? వ‌ద్దా? అన్న మీ మాంస‌లో ఉన్న కీల‌క‌మైన నేతలు పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, జాప‌ల్లికృష్ణారావు వంటి నేత‌లను బీజేపీ ఎంత ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ వాళ్లంతా కాంగ్రెస్ వైపు నిర్ణ‌యం తీసుకున్నారు.


దీనికి ముందుగా చేరిక‌ల క‌మిటీ చైర్మ‌న్ హోదాలో ఈట‌ల వెళ్లి క‌లువ‌గా అన్నా మీరే కాంగ్రెస్‌కు రండి అని ఎదురు ఆహ్వానించారు. ఈ విష‌యాన్ని ఈట‌ల ఒక సంద‌ర్భంగా మీడియాకే చెప్పారు. అయితే ఈట‌ల రాజేంద‌ర్ చేరిక‌తో బీజేపీకి ఒక వేవ్ వ‌చ్చిన మాట వాస్త‌వమే కానీ, బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం బీఆరెస్ ప‌ట్ల అనుస‌రించిన వైఖ‌రితో పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. దీనిని గుర్తించిన నేత‌లు బీజేపీకి దూరం కాగా… ప్ర‌త్యేక ఆహ్వానం ఉన్న‌ప్ప‌టికీ ఈట‌ల రాజేంద‌ర్ అలాగే ఉండి పోవ‌డంతో రాజ‌కీయంగా తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌లో జ‌రుగుతోంది.

ముఖ్యంగా రాష్ట్రంలో బీఆరెస్‌కు పూర్తి మెజార్టీ రాకుండా బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వ‌స్తే త‌న‌కు డిప్యూటీ సీఎం ప‌ది వ‌స్తుంద‌న్న ఆశ కూడా ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల‌లో ప్ర‌చారం జ‌రిగింది. కానీ కాంగ్రెస్ పూర్తి మెజార్టీ దిశ‌గా అడుగులు వేయ‌డంతో పాటు గ‌జ్వెల్‌, హుజూరాబాద్‌ల‌లో ఈట‌ల వెనుకంజ‌లో ఉన్నారు. దీంతో ఈట‌ల ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డిలా త‌యారైంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.